»   » ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!

ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం రసవత్తరంగా సాగనుంది. దీనికి కారణం ఉత్తమ దర్శకుడి విభాగంలో మాజీ భార్యాభర్తలు పోటీపడుతుండటమే. అందులోనూ ఒకరు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోగా, మరొకరు డైరెక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ రెండు సార్లు ఒకరంటేఒకరు అనేంత రసవత్తరంగా పోటీ సాగడం విశేషం. మరి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ వీరిద్దరూ నామినేట్ అవ్వడంతో వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ జరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరెవరో మీకిపాటికి అర్థమయ్యే వుంటుంది. వారే అవతార్ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్, ది హర్ట్ లాకర్ సినిమాకు దర్శకత్వం వహించిన క్యాథరిన్ బిగిలో.

కానీ డైరెక్టర్స్ గిల్డ్ అవార్డుల్లో విజేతగా నిలిచిన దర్శకున్నే ఆస్కార్ వరిస్తుండటం జరుగుతోంది. 50 ఏళ్లకు పైగా చరిత్ర వున్న ఈ అవార్డుల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే ఈ అంచనా తప్పింది. దీనికి తోడు క్యాథరిన్ రూపొందించిన ఈ సినిమా ఇరాక్ యుద్ధనేపథ్యంలో జరుగుతుంది. అవతార్ సినిమా ఓ ఊహాజనిత కథ కాగా ఇది ఆలోచింపజేసే రియల్ స్టోరీ కావడం మరో ప్లస్ పాయింట్. దీంతో ఈ ఏడాది ఆస్కార ఖచ్చితంగా క్యాథరిన్ నే వరిస్తుందని కొందరు వాదిస్తుంటే, గోల్డెన్ గ్లోబ్ అవార్డును పొందిన కామెరూన్ నే అవార్డు వరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. డైరెక్టర్స్ గిల్డ్ అవార్డుల్లో ఆరు సార్లు అంచనా తప్పినట్టే మరో సారి అంచనా తప్పుతుందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. మరి ఎవరిని ఆస్కార్ వరిస్తుందో మరి..?! ఇంకా ఈ క్యాటగిరీలో కామెరూన్, క్యాథరిన్ లతో పాటు అప్ ఇన్ ది ఎయిర్, ప్రీషియస్, ఇన్విక్టస్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ మరియు ఆన్ ఎడ్యుకేషన్ సినిమాలు పోటీపడుతున్నాయి. కానీ ప్రధానంగా పోటీ మాత్రం అవతార్, ది హర్ట్ లాకర్ సినిమాల మధ్యే జరుగనుంది అనడంలో సందేహంలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu