»   » అవతార్-2, 3, 4 సీక్వెల్స్ వస్తున్నాయ్

అవతార్-2, 3, 4 సీక్వెల్స్ వస్తున్నాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : టైటానిక్ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ కు 'అవతార్' వంటి అద్భుత సాంకేతిక విలువలతో కూడిన ప్రేమ కథా చిత్రాన్ని అందించడానికి 15 ఏళ్లు పట్టింది. అయితే మాత్రం ఏంటి చరిత్రలో చిరస్థాయి గా నిలిచిపోయే విధంగా ఈ సినిమా రూపొందింది.

టర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ మరియు టైటానికి వంటి చిత్రాలను రూపొందించిన కామెరూన్ 300 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా 2009 డిసెంబర్లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Avatar

తాజాగా అవతార్ సినిమా అభిమానులకు దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీపి కబురు అందించారు. అవతార్ చిత్రానికి మరో మూడూ సీక్వెల్స్ అవతార్-2, అవతార్-3, అవతార్-4 రూపొందించే ప్రయత్నంలో ఉన్నామని, వచ్చే ఏడాది ప్రొడక్షన్ వర్కు స్టార్ట్ అవుతుందని తెలిపారు.

2016, 2017, 2018 సంవత్సరాల్లో వరసుగా డిసెంబర్ నెలల్లో ఈ మూడు సీక్వెల్స్ రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని వెల్లడించారు. అవతార్ సినిమాను మించిన అద్భుతాలను, ఊహకందని సన్నివేశాలను ఈ మూడు సీక్వెల్స్ లో ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని అంటున్నారు.

English summary
Director James Cameron has announced three sequels to his 2009 hit Avatar. The Hollywood filmmaker says that Avatar 2, 3 and 4 will be shot simultaneously with production kicking off next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu