»   » జోక్ ఆఫ్ ది బాలీవుడ్: జేమ్స్ కామెరూన్ తో అసిన్ సినిమా

జోక్ ఆఫ్ ది బాలీవుడ్: జేమ్స్ కామెరూన్ తో అసిన్ సినిమా

Subscribe to Filmibeat Telugu

సరికొత్త 'అవతార్'ను సృష్టించి 'టైటానిక్' అంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాన్ని రూపొందించిన ఆయన ఓ భారతీయ సినిమాను రూపొందించనున్నాడా..?? అవునంటోంది కేరళ కుట్టి బాలీవుడ్ లో 'లండన్ డ్రీమ్స్' సినిమాతో కుదేలయిన అసిన్.

న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫోరమ్ ఆఫ్ ది ఇండియాటుడే కాన్ క్లేవ్ లో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన కామెరూన్ ను ఈ కాన్ఫరెన్స్ కు హాజరయిన అసిన్ తెగ ఆకర్షించడానికి ప్రయత్నించిందట. దీంతో ఆమెతో మాటలు కలిపిన కామెరూన్ ను ఆమె ఓ ఇండియన్ సినిమాను తీయవచ్చుగా అని అడిగిందట. తప్పకుండా తీద్ధాం కానీ పాటల, డ్యాన్సులు వుండకూడదని గట్టిగా నవ్వేసాడట. దీంతో అసిన్ తన మేనేజర్ కు అసిన్ జేమ్స్ కామెరూన్ తీయబోయే భారతీయ సినిమాలో నటించనుంది అని ప్రచారం చెయ్యమని చెప్పి తను మాత్రం అవునా అలా వార్తలు వచ్చాయా ఏమో కామెరూన్ నన్ను అయితే ఇంకా సంప్రదించలేదు అని బడాయిపోతోందట. బాలీవుడ్ కే గతిలేని అసిన్ హాలీవుడ్ కా..?? అదీ జేమ్స్ కామెరూన్ సినిమాలోనా..!? వినడానికే విడ్డూరంగా లేదూ..! అయినా ఇంట్లో అన్నం వండనమ్మ పక్కింట్లో బిర్యానీ వండుతానని అన్నట్టు అసిన్ బాలీవుడ్ లో ఈదలేక హాలీవుడ్ కు వెళుతుందట..!? ఇదంతా బాలీవిడ్ అవకాశాలు పట్టడానికి చేస్తున్న దిక్కుమాలిన ప్రచారం అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఏమిటో ఈ మాయ అసిన్ కే తెలియాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu