Avatar 2 అద్బుతం.. కళ్లు చెదిరే దృశ్యాలు.. ట్రైలర్, మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

హాలీవుడ్‌తోపాటు ప్రపంచ సినిమా చరిత్రలో సంచలన విజయం సాధించిన అవతార్ చిత్రానికి సీక్వెల్‌గా అవతార్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 13 ఏళ్ల క్రితం అవతార్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ 2 చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను హాలీవుడ్ హీరోయిన్ జో సల్దానా ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించడం, ఆమె ఇంటర్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో అవతార్ 2 సినిమా గురించి, జో సల్దానా చెప్పిన విషయాల్లోకి వెళితే..

Recommended Video

Avatar 2 Movie Update, Trailer & Movie Release Details | Filmibeat Telugu
అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో

అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో

అవతార్ చిత్రానికి సీక్వెల్‌గా అవతార్ 2గా జేమ్స్ కామెరాన్ అద్భుతమైన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో నీటి అడుగు భాగంగా భారీగా సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ చిత్రం జరుపుకొంటున్నది. అండర్ వాటర్ మోషన్ కాప్చర్ ద్వారా చిత్రీకరించిన సన్నివేశాలు వెండితెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నది అని అవతార్ 2 చిత్రంలో నటించిన జో సల్దానా వెల్లడించింది.

20 నిమిషాల సినిమా చూశా..

20 నిమిషాల సినిమా చూశా..

అవతార్ 2 సినిమా గురించి జో సల్దానా వెల్లడిస్తూ.. ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల ఫుటేజ్‌ను దర్శకుడు జేమ్స్ కామెరాన్‌తో కలిసి చూశాను. అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నీటి అడుగు భాగంలో చిత్రీకరణ ఓ ఛాలెంజ్. అలాంటి చాలెంజ్‌కు జేమ్స్ కామెరాన్ సవాల్ విసిరారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ సన్నివేశాలను చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. 20 నిమిషాల సినిమా చూస్తే పవర్ ఫుల్‌గా, దృశ్యకావ్యంలా అనిపించింది అని జో సల్దానా చెప్పింది.

అవతార్ సినిమాను మించి

అవతార్ సినిమాను మించి

13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ సినిమాను మంచి అవతార్ 2 ఉంటుంది. మరో తొమ్మిది నెలల్లో అవతార్ 2 థియేటర్లలోకి రాబోతున్నది. నేను వీక్షించిన సన్నివేశాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. ఆ సీన్లు చూసిన తర్వాత మాటల్లేవు. ఓ దశలో నేను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకొన్నాను. ప్రేక్షకుడు కూడా అదే అనుభూతిని పొందడం ఖాయం. ఈ సినిమా ట్రైలర్ మే 6వ తేదీన రిలీజ్ అవుతున్నది అని ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ నటి జో సల్దానా చెప్పారు.

అవతార్ 2 డిసెంబర్ 16వ తేదీన

అవతార్ 2 డిసెంబర్ 16వ తేదీన


అవతార్2 డిసెంబర్‌ 16వ తేదీన వస్తున్నది. ఇప్పుడే అవతార్ 5కి సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్దంగా ఉంది. ప్రతీ సీక్వెల్ అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరాన్ గొప్ప కథను, ఒరిజినల్ కథను, బ్యూటీఫుల్ స్టోరిని గ్రేట్‌గా చెప్పబోతున్నాడు. ప్రేక్షకుడు ప్రతీ సన్నివేశంలోను భావోద్వేగానికి గురి అవుతాడు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 రిలీజ్ ఎప్పుడంటే?

అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 రిలీజ్ ఎప్పుడంటే?

సినీ ప్రేక్షకులను అవతార్ సీక్వెల్స్ కొత్త అనుభూతికి గురిచేసేందుకు సిద్దం అవుతున్నాయి. అవతార్ 2 చిత్రం డిసెంబర్ 16న రిలీజ్ కానున్నది. అలాగే అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024లో విడుదల అవుతుంది. అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028 రిలీజ్ ప్లాన్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X