»   » విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

విమాన ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ ప్రముఖుడు, ఆస్కార్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ కంపోజర్‌ జేమ్స్ హార్నర్(61) విమాన ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని సాంటా బార్బరా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అయింది. తన చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

James Horner dies in plane crash

జేమ్స్ హార్నర్ పలు హాలీవుడ్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తో కలిసి జేమ్స్ హార్నర్ ‘టైటానిక్' చిత్రానికిగాను రెండు అకాడెమీ అవార్డులు సొంతం చేసుకున్నాడు. కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఏలియన్స్, అవతార్ ప్రపంచ వ్యాప్తంగా మిలయన్ల కొద్దీ రికార్డులు అమ్ముడయ్యాయి.

జేమ్స్ హార్నర్ సౌండ్ ట్రాక్ సమకూర్చిన...సౌత్‍‌పా, వోల్ఫ్ టోటెమ్, ది 33 త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవతార్ సీక్వెల్‌కు జేమ్స్ కామెరూన్‌తో కలిసి హార్నర్ పని చేయాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేమ్స్ హార్నర్ మరణంతో ఫిల్మ్, మ్యూజిక్ లవర్స్ విషాదంలో మునిగి పోయారు.

English summary
James Horner, the legendary Oscar winning music composer known for his remarkable soundtracks for numerous Hollywood films, died in a plane crash near Santa Barbara, USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu