»   » 'సోదరు'ని స్థానాన్ని భర్తీ చెయ్యడానికి నడుం బిగించిన 'సోదరి'..!!

'సోదరు'ని స్థానాన్ని భర్తీ చెయ్యడానికి నడుం బిగించిన 'సోదరి'..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచం పాప్ సంగీత ప్రపంచంలో జాక్సన్ కుటుంబానిది చెరిపెయ్యలేని అధ్యాయం. దీనికి ప్రధాన కారణం మైఖేల్ జాక్సన్. మైఖేల్ తో పాటు ఆయన సోదరసోదరీమణులు కూడా గాయకులే. వీరంతా కలసి ఒకప్పుడు జాక్సన్-5 అనే బృందాన్ని స్థాపించి ప్రపంచం మొత్తం ప్రదర్శనలు ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత విడిపోయారు. చాలా కాలం తర్వాత మళ్లీ అందరూ కలసి మరో సారి ప్రపంచ యాత్ర చేసి ప్రదర్శనలు ఇవ్వలని నిర్ణయించుకున్నప్పటికీ మైఖేల్ హఠాన్మరణంతో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడింది.

ఇప్పుడతని స్థానాన్ని భర్తీ చెయ్యడానికి మైఖేల్ సోదరి జానెట్ జాక్సన్ నడుబిగించింది. తొలుత ఈ బృందంలో చేరడానికి నిరాకరించిన జానెట్ ఆ తర్వాత మనసు మార్చుకుని బృందంతో కలసింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు జర్మెయిన జాక్సన్ వెళ్లడించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu