»   » జేమ్స్ బాండ్‌ విలన్‌గా అదృష్టం నన్నే వరిస్తుందేమో చూడాలి...

జేమ్స్ బాండ్‌ విలన్‌గా అదృష్టం నన్నే వరిస్తుందేమో చూడాలి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జేమ్స్ బాండ్ సినిమా విడుదలవుతుందంటే యావత్ ప్రపంచం మొత్తం ఆసినిమావైపు ఒక కన్నేసి ఉంచుతుంది. దానికి కారణం ప్రజలలో జేమ్స్ బాండ్ సినిమాలపై ఉన్న క్రేజి అలాంటిది. అమెరికా గుఢాచారిగా జేమ్స్ బాండ్ చేసేటటువంటి విన్యాసాలే దీనికి కారణం. జేమ్స్ బాండ్ సినిమాలలో ప్రతిది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటిది విలన్ విషయంలో ఇంకెన్నీ ప్రత్యేకతలు తీసుకుంటారో చెప్పాల్సినపని లేదు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసు కుంటున్న 23వ జేమ్స్ బాండ్ 007 సినిమాలో హీరోగా డానియేల్ గ్రెగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించినటువంటి విలన్ వేషానికిగాను స్పానిష్ యాక్టర్ అయినటువంటి జేవియర్ బార్డెమ్ రేసులో ఉన్నట్లు సమాచారం. జేమ్స్ బాండ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నటువంటి శ్యామ్ మెండిస్‌ను ఇటీవలే జేవియర్ బార్డెమ్ కలవడం జరిగింది. ప్రస్తుతానికి ఈప్రాజెక్టులో చేరనప్పటికీ, సినిమాలో విలన్ అవకాశం కోసం బాగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. శ్యామ్ మెండిస్‌ కూడా జేవియర్ బార్డెమ్‌ను తీసుకునే సూచనలు ఉన్నాయని సమాచారం.

ఈసందర్బంలో జేవియర్ బార్డెమ్ మాట్లాడుతూ నేను జేమ్స్ బాండ్ సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అప్పటి జేమ్స్ బాండ్ సీన్ కానరీ సినిమాలు మానాన్న గారితో చూసినటువంటి రోజులు తలచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అసమయంలో జేమ్స్ బాండ్ దేశం కోసం చేసేటటువంటి సాహాసాలు చూస్తుంటే నేను చాలా మంత్ర ముగ్దుడిని అయ్యేవాడినని అన్నారు.

కాబట్టి అలాంటి జేమ్స్ బాండ్ సిరిస్ సినిమాలలో విలన్‌గా నటించే అవకాశం వచ్చిందంటే మాత్రం అస్సలు వదులుకోను అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం నాకు శ్యామ్ మెండిస్ వెల్లడిచంలేదు. నేను ఇంటికి వెళ్శిన తర్వాత ఈఅవకాశం నాతలుపులు తట్టవచ్చునేమో అని అనుకుంటున్నాను. అటు తర్వాత నాసత్తా చూపుతాను జేమ్స్ బాండ్ సినిమాలలో విలన్ అంటే ప్రపంచం మొత్తం నాచేతుల్లోనే అన్నమాట అని నవ్వుతూ అన్నారు. ఈసినిమాని 2012 క్రిస్టమస్‌కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు శ్యామ్ మెండిస్.

English summary
Javier Bardem has confirmed he's in talks to star opposite Daniel Craig in the upcoming 23rd 007 movie, which is due for release in 2012. The Spanish actor has met with the film's director Sam Mendes to discuss the role, and although he has yet to sign a contract, he reveals he's thrilled about the possibility of joining the James Bond franchise as the latest villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu