»   » నచ్చిన వారితోనే డేట్స్ కి వెళతాను..!

నచ్చిన వారితోనే డేట్స్ కి వెళతాను..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెన్నిఫర్ ఆనిస్టన్ తన రెండుగంటల టైమ్ ను ఇటాలియన్ డిన్నర్ కోసం కోగర్ టౌన్ హిరో 'జాన్ హాప్ కిన్స్' తో బేవర్లీ హిల్స్ లోని మాడోలో గడపడం జరిగింది. ఇది చూసిన జనాభా దీని గురించి పలు భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేశారు. ఆమె డేట్ కోసం చాలా ఎగ్జైట్ గా కనిపించారని, అంతేకాకుండా జాన్ మరియు జెన్నిఫర్ ఇద్దరు ఒక ప్రయివేట్ టేబుల్ బుక్ చేసుకోని సపరేట్ గా ఏకాంతంగా కూర్చున్నారని వారు వివరించారు. వీరిద్దరి గురించి ఒకరికి ఒకరు పెద్దగా తెలియకపోయినా వీరు కూర్చున్న తీరు అందరికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేలావుందని అన్నారు. ఈ సందర్భంలో జాన్ హాప్ కిన్స్ మాత్రం చాలా ఆనందంగా కనిపించారని అన్నారు. ఈ సంబంధంపై జాన్ మరియు జెన్నిఫర్ ని అడగగా వాళ్శు మాట్లాడడానికి నిరాకరించారు.

ఇదిలా వుంటే అనిస్టాన్ మరో మాజీ భర్త మ్యుజీషియన్ జాన్ మేయర్ అనిస్టాన్ ను తిరిగి తన జీవితం లోకి ఆహ్వానించాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జాన్ అనిస్టాన్ కు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ తో తిరిగి తనతో జీవించాలని అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 31 ఏళ్ల మ్యుజీషియన్, 40 ఏళ్ల అనిస్టాన్ ను తిరిగి తనతో వుండమని బ్రతిమలాడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జాన్ మేయర్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

చివరగా తెలిసింది ఏమిటంటే జెన్నిఫర్ ఆనిస్టన్ తన సంతోషం కోసమే ఇలాంటివి అన్ని చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. దానితో పాటు తనకి నచ్చిన వారితోనే డేట్స్ కి వెళతానని చెప్పడం కోసమెరుపు. ఈ విషయం తెలిసిన కోందరు హిరోలు జెన్నిఫర్ ఆనిస్టన్ డేట్ కోసం తహతహలాడుతున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu