»   » సహనటుడి ప్రేమలో మునిగితేలుతున్న భామ..!!

సహనటుడి ప్రేమలో మునిగితేలుతున్న భామ..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ తార, బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ తాజాగా నటిస్తున్న సినిమా 'ది బౌంటీ హంటర్' సినిమా కథానాయకుడు గిరార్డ్ బట్లర్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందనే వార్తలు హాలీవుడ్ వీధుల్లో షికారు చేస్తున్నాయి. తన భర్త బ్రాడ్ పిట్ తనని వదిలి ఏంజలీనా జోలీతో కలసి తిరుగున్నప్పుడు కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన అనిస్టాన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సినిమాలు చేస్తూ బిజీగా వుండటమే అందుకు సరైన మార్గమని భావించిన అనిస్టాన్ ది బౌంటీ హంటర్ సినిమాను అంగీకరించింది. రొమాంటిక్, యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు వీరిద్దరి మధ్య నిజంగానే రొమాన్స్ మొదలయిందట.

ఇటీవలే జరిగిన గోడ్జెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి హాజరయిన వీరిద్దరూ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వారిద్దరి మధ్య అన్యోన్యతను చూసిన వారు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ వుందని చెవులుకొరుక్కున్నారు. ఇదే ప్రశ్నను అనిస్టాన్ ముందుంచగా ఓహ్ బట్లర్..!! అతను చాలా మంచి వ్యక్తి.. అతనితో సినిమా అప్పుడే పూర్తయిపోయిందా అనిపిస్తోంది. అతనితో స్నేహం చాలా స్వీట్ గా వుంది ఆమె వ్యాఖ్యానించారు. అంటే మీఇద్దరి మధ్య ఏముందని అంటే జస్ట్ ఫ్రెండ్ షిప్ అని ముగించింది. కానీ ఆమె చెబుతున్నది చూస్తే మాత్రం కేవలం ప్రెండ్సే అంటే నమ్మసఖ్యంగా లేదు...!! ఏమంటారు...!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu