»   »  ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్

ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ హాట్ హీరోయిన్లలో జెన్నిఫర్ ఆనిస్టిన్ ఒకరు. తన అందచందాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘనత ఆమెది. ఆమె నటించే స్టీమీ సీన్లంటే శృంగార ప్రియులు తెగ ఆసక్తి చూపుతుంటారు.

తాజాగా ఈ హాట్ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు జస్టిన్ థ్రాక్స్ తో మూడేళ్ల క్రితమే ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి ఏ మాత్రం తెలియకుండా ఆగస్టు 5 వీరు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు దాదాపు 70 మంది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారట.

Jennifer Aniston & Justin Theroux Get Married Secretly At Bel Air Home

గతేడాదే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.....తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు. భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 44 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. ఇపుడు రహస్యంగా వివాహం చేసుకున్నారు.

English summary
Another secret celebrity wedding just took place! Jennifer Aniston and Justin Theroux managed to secretly tie the knot at their Bel Air home without even giving a hint of the wedding to the whole world.
Please Wait while comments are loading...