ప్రియుడి కోసం వెతుకుతున్నా.. దొరికితే సహజీవనం.. 52 ఏళ్లలో జెన్నీఫర్ రొమాన్స్‌కు రెడీ.. ఆస్తి ఎంతో తెలుసా?
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్ మరోసారి సహజీవనంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు వివాహాలు బ్రేకప్ అయి.. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నది. అయితే తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. మంచి ప్రియుడి కోసం వెతుకుతున్నాను అంటూ హింట్ ఇచ్చారు. అయితే ప్రియుడు, మ్యారేజ్ గురించి మాట్లాడిన అనిస్టన్ వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వెళితే..

52 సంవత్సరాల వయసులో
హాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్ వయసు 52 సంవత్సరాలు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తనదైన శైలిలో రాణిస్తున్నారు. హాలీవుడ్‌లో 1987లో అడుగుపెట్టి ఇప్పటి వరకు అదే జోష్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఊహించిన విధంగా రెండుసార్లు తన భర్తల నుంచి విడాకులు తీసుకొన్నారు.

మూడో పెళ్లి కోసం...
హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2005లో విడిపోయారు. ఆ తర్వాత పదేళ్లు ఒంటరిగానే ఉన్న ఆమె జస్టిన్ తెరోక్స్‌ను 2015లో పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. 2017లో వారిద్దరు విడిపోయారు. దాదాపు నాలుగేళ్లుగా ఆమె సింగిల్ స్టాటస్‌ను కొనసాగిస్తూ మూడో రిలేషన్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నారు.

బ్రాడ్‌పిట్‌తో మళ్లీ రొమాన్స్
అయితే ఎంజెలీనా జోలితో తెగతెంపులు చేసుకొన్న బ్రాడ్‌పిట్‌తో జెన్నిఫర్ ఆనిస్టన్ మళ్లీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు తగినట్టుగానే ప్రైవేట్ టూర్ వెళ్లి మీడియా కంటికి చిక్కారు. అయితే తనతో రిలేషన్‌షిప్ కొనసాగుతున్నదనే విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్ పిట్‌తో నాకు మధ్య ఓ బంధం ఉంది. ఆ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

ప్రియుడు దొరికితే సహజీవనానికి
అయితే పీపుల్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ అనిస్టన్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవడానికి నాకు ప్లాన్స్ లేవు. కానీ ఎవరైనా మంచి భాగస్వామి దొరికితే సహజీవనాన్ని ఎంజాయ్ చేయాలనుకొంటున్నాను అని అన్నారు. అందుకోసం ఫెంటాస్టిక్ పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నాను. అతడికి కూడా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనే కోరిక ఉండాలి అని తెలిపారు.

ఆన్‌లైన్ డేటింగ్ ఇష్టం లేదు..
పార్ట్‌నర్‌తో డేటింగ్ విషయంపై జెన్నిఫర్ అనిస్టన్ మాట్లాడుతూ.. నాకు ఆన్‌లైన్ డేటింగ్ చేయడం ఇష్టం లేదు. ప్రత్యక్షంగా ఓ వ్యక్తిని కలిసి డేటింగ్ చేయడానికి ఇష్టపడుతాను. ఎవరైనా నా మనసుకు నచ్చిన వ్యక్తి ప్రపోజ్ చేస్తే అతడితో సహజీవనం చేయడానికి రెడీ అని అన్నారు. అయితే బ్రాడ్‌పిట్ మోడల్ నికోల్ పొటురస్కీతో సంబంధం పెట్టుకొన్నారనే వార్తల మధ్య జెన్నిఫర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

2 వేల కోట్లకుపైగా సంపదతో
ఇక జెన్నిఫర్ అనిస్టన్ విషయానికి వస్తే.. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో స్వచ్చంద సేవ చేస్తున్న ఆమె ఆస్తి 2020 గణాంకాల ప్రకారం... 300 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 2 వేల కోట్ల రూపాయలు అని అంచనా వేశారు. ఎన్నో కోట్లు వెచ్చిస్తూ సమాజ సేవకు అంకితం అయ్యారు.


Click it and Unblock the Notifications











