Don't Miss!
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
US Elections results: నగ్నంగా మారిన స్టార్ సింగర్.. అర్ధనగ్నంగా జెన్నిఫర్ లోపేజ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు ఉత్కంఠను రేకేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతున్న సమయంలో హాలీవుడ్ సినీ తారలు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫోటోలు పెడుతున్నారు. తాజాగా జెన్నిఫర్ లోపేజ్, చెల్సియా హ్యాండ్లర్, కేట్ బెకిన్‌సేల్, కెండాల్ జెన్నీఫర్, లొజో లాంటి తారలో సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ఎలాంటి పోస్టులు పెట్టారంటే...

హాలీవుడ్ తారలు తమదైన శైలిలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాలీవుడ్ తారలు తమదైన శైలిలో ప్రభావం చూపారు. తమకు నచ్చినవారికి ఓట్లు వేయాలని సూచించారు. ఓటర్లను తమ హక్కును ఉపయోగించుకోవాలని స్ఫూర్తి కలిగే విధంగా ప్రచారం చేశారు. అలా ఎన్నో రకాలుగా సినీ తారలు ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలపై తమదైన ప్రభావం చూపారు.

నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ
జెన్నిఫర్ లోపేజ్, చెల్సియా హ్యాండ్లర్, కేట్ బెకిన్‌సేల్, కెండాల్ జెన్నీఫర్ తారల్లో కొందరు స్టికర్లు పోస్టు చేసి ఓటర్లకు ఉత్సాహం కలిగించగా.. మరొకొందరు అర్ధనగ్నంగా.. మరోకరు నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఎన్నికల వేళ ఆడా, మగా అనే తేడా లేకుండా నగ్నంగా ఫోజులివ్వడం గమనార్హం.

నెకెడ్ బ్యాలెట్ అంటూ ప్రచారం
నెకెడ్ ఓటు అనే క్యాంపెయిన్‌లో భాగంగా హల్క్ ఫేమ్ మార్క్ రఫెలో, కెమెడియన్స్ అమీ స్కూమెర్, సారా సిల్వర్ మ్యాన్, క్రిస్ రాక్, సూపర్ మోడల్ నోమీ క్యాంప్‌బెల్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నెకెడ్ బ్యాలెట్ అంటూ ఓటర్లను ఉత్సాహ పరిచారు.

నగ్నంగా మారిన లిజో
అమెరికా సింగర్, ర్యాపర్ లిజో దాదాపు నగ్నంగా మారి పారదర్శకంగా ఓటు వేయాలని సూచించారు. అందమైన అమెరికాకు మంచి రోజులు రావాలి. వర్ణ వివక్ష లేకుండా అందరికి సమాన హక్కులు లభించాలి. స్వేచ్చగా అందరూ జీవించాలి. తమ మతాలకు అనుగుణంగా ఆలయాలు, చర్చీలలో ప్రార్థనలు కొనసాగాలి అంటూ లిజో సుదీర్ఘమైన పోస్టును ఇన్స్‌టాలో పెట్టారు. నగ్నంగా మారి అమెరికా జెండాను భుజాన వేసుకొని ఫోజులిచ్చారు.

అర్ధనగ్నంగా జెన్నిఫర్ లోపేజ్
అమెరికా యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపేజ్ కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తమ వంతు పాత్రను పోషించారు. పింక్ బ్రాను ధరించిన ఆమె నేను ఓటు వేశాను. మీరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకొండి అంటూ జెన్నీఫర్ లోపేజ్ ఫోటోకు ఫోజిచ్చారు. తన ఛాతిపై ఓటు వేశాను అనే స్టిక్కర్‌ను పెట్టుకొన్నారు.