»   » సెక్సీ బ్యూటీకి విడాకులు: నాలుగో పెళ్లికి సిద్ధం!

సెక్సీ బ్యూటీకి విడాకులు: నాలుగో పెళ్లికి సిద్ధం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ తన భర్త మార్క్ ఆంటోనితో విడిపోయిన విషయం తెలిసిందే. వీరు విడిపోయిన దాదాపు మూడేళ్ల అనంతరం కోర్టు నుండి వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. వీరికి ఆరేళ్ల వయసున్న కవలలు ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్ సంరక్షణలోనే పిల్లలు ఉంటారు కాబట్టి నెలలో వారంరోజులు ఆంటోని పిల్లలతో గడిపే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

కొన్ని రోజుల క్రితం జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ.... తన భర్త మార్క్ ఆంథోని విడిపోవడమే జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ అన్నారు. 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆంథోని నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం లోపెజ్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం.

Jennifer Lopez and Marc Anthony finalize divorce

మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారింది. ఎన్నడూ లేనంతగా జీవితంలో విషాదం నిండుకుందన్నారు. కొద్దికాలం పాటు ఆఘటన గురించి తలచుకుని బాధపడ్డాను. ప్రస్తుతం రియలైజ్ అవుతున్నాను. జీవితంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇక జీవితాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలనుకుంటున్నాను లోపెజ్ అన్నారు.

కాగా.....ఆంటోని కంటే ముందే జెన్నిఫర్‌కు రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయ్యాయి. ఆంటోనీ ఆమె మూడో భర్త. అతని నుండి విడిపోయినప్పటి నుండి రెండేళ్లగా డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపేజ్ డేటింగ్ చేస్తోంది. అన్ని కుదిరితే అతన్ని జెన్నిఫర్ లోపెన్ నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

English summary
Jennifer Lopez and Marc Anthony's divorce has been finalized nearly three years after the singers separated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu