Don't Miss!
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- News
Lady: భర్తను వదిలేసి ఇంట్లో ప్రియుడితో రొమాన్స్, అక్క లవర్ తల నరికిన తమ్ముడు, ఇద్దరిని వదల్లేదు!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
సీక్రెట్‌గా జెన్నిఫర్ లోపేజ్ మ్యారేజ్.. ఆమెకు నాలుగో పెళ్లి..అతడికి రెండోసారి.. భర్త ఎవరంటే?
హాలీవుడ్ అగ్రతారలు బెన్ అఫ్లేక్, జెన్నిఫర్ లోపేజ్ అనేక రూమర్లకు తెరదించుతూ వివాహం చేసుకొన్నారు. అమెరికాలోని నేవడాలో జరిగిన వివాహ వేడుకలో నిన్ను భార్యగా మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను అని పురోహితుల ముందు నూతన దంపతులు ప్రమాణం చేసినట్టు హాలీవుడ్ మీడియా కథనాన్ని వెల్లడించింది. బెన్, జెన్నిఫర్ వివాహ వేడుక, వ్యక్తిగత జీవితం గురించిన వివరాల్లోకి వెళితే..

జెన్నిఫర్ లోపేజ్‌కు నాలుగో పెళ్లి
జెన్నిఫర్ లోపేజ్‌కు ఇది నాలుగో వివాహం. తొలి వివాహం ఓజాని నోతో జరిగింది. వారిద్దరు 1997 నుంచి 1998 వరకు కాపురం చేశారు. ఆ తర్వాత క్రిస్ జడ్‌ను 2001లో వివాహం చేసుకొని.. 2003లో విడిపోయారు. ఆ తర్వాత మార్క్ ఆంథోనిని 2004లో వివాహం చేసుకొని.. అదే సంవత్సరం విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకొన్నారు.

బెన్ అఫ్లేక్‌కు రెండో పెళ్లి
ఇక బెన్ అఫ్లెక్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఇది ఆయనకు రెండో పెళ్లి. రెండుసార్లు కూడా ఆయన జెన్నిఫర్ లోపేజ్‌ను పెళ్లి చేసుకొన్నాడు. తొలిసారి 2005 నుంచి 2018 వరకు డేటింగ్ చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలు రావడంతో విడిపోయారు. తిరిగి మళ్లీ 2022లో వివాహం చేసుకొన్నారు. వీరిద్దరికి ముగ్గురు సంతానం ఉన్నారు.

ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో
జెన్నిఫర్ లోపేజ్ మ్యారేజ్ చేసుకొంటుందనే వార్తలు గత కొద్ది నెలలుగా వైరల్ అవుతున్నాయి. బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ వ్యవహారం మీడియా బహిరంగమైంది. ఇక ఇటీవల ఫర్నీచర్ షాపింగ్ సందర్భంగా తన బిడ్డతో కలిసి మీడియా కంటికి చిక్కింది. ఆ సమయంలో జెన్నిఫర్ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉండటం అందర్నీ ఆకర్షించింది. దాంతో ఆమె పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇంటి కోసం జెన్ని, బెన్ వేట
ఇక పెళ్లికి ముందే జెన్నిఫర్, బెన్ అఫ్లేక్ దంపతులిద్దరు తాము జీవించేందుకు కొత్త ఇంటి కోసం వేట మొదలుపెట్టారు. అయితే వారి జీవన విధానానికి సరిపోయే విధంగా బెవెర్లీ హిల్స్‌లో ఓ అధునాతన, విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు అని హాలీవుడ్ మీడియా వెల్లడించింది. పెళ్లి తర్వాత వారిద్దరు కలిసి జీవించేందుకు అన్ని రకాల వసతులను సమకూర్చుకొన్నట్టు కథనంలో పేర్కొన్నారు.

జూలై 16వ తేదీన వివాహం
హాలీవుడ్
మీడియా
కథనాల
ప్రకారం..
జెన్నిఫర్
లోపేజ్‌ను
బెన్
అఫ్లెక్
అమెరికాలోని
నెవడాలోని
క్లార్క్
కౌంటీలో
జూలై
16వ
తేదీన
వివాహం
చేసుకొన్నారు.
వివాహం
అనంతరం
చట్టబద్దంగా
మ్యారేజ్
ధృవీకరణ
పాత్రలను
తీసుకొన్నారు.
అతికొద్ది
సన్నిహితులు,
శ్రేయోభిలాషుల
మధ్య
వివాహం
జరిగింది.
తమ
వివాహానికి
సంబంధించిన
వార్తను
మీడియాకు
నూతన
దంపతులు
ధృవీకరించినట్టు
సమాచారం.

రహస్యంగా పెళ్లి చేసుకోవడంపై
జూలై 16వ తేదీన జరిగిన పెళ్లి విషయాన్ని మీడియాకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయినా వారిద్దరి పెళ్లి వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. అయితే తమ పెళ్లి వార్తను గోప్యంగా ఉంచడం మీడియాకు అంతు చిక్కని వార్తగా మారింది. రహస్యంగా బెన్, జెన్నిఫర్ పెళ్లి చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది.