Don't Miss!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ప్రియుడికి జెన్నీఫర్ లోపేజ్ గుడ్‌బై... నాలుగేళ్లు సహజీవనం.. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్!
హాలీవుడ్ అందాల భామ, గాయని జెన్నీఫర్ లోపేజ్ తన జీవిత భాగస్వామికి గుడ్‌బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే నాలుగేళ్ల సహజీవనానికి ముగింపు పలికింది. న్యూయార్క్‌కు చెందిన బేస్‌బాస్ క్రీడాకారుడు అలెక్స్ రోడ్రిగ్జ్‌తో సహజీవనం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన జీవిత భాగస్వామితో జెన్నీఫర్ విడిపోవడం ఇది నాలుగోసారి. గతంలో ఓజానీ నోవా, క్రిస్ జుడ్, మార్క్ ఆంథోని నుంచి విడాకులు తీసుకొన్నారు.
హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోన్న బుల్లితెర నటి నియా శర్మ
గత కొద్దికాలంగా అలెక్స్, జెన్నీఫర్ విడిపోతారంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రిక వారిద్దరి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందంటూ కథనాన్ని వెల్లడించింది. జెన్నీఫర్ కంటే అలెక్స్ సుమారు ఆరేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. జెన్నీఫర్‌కు 51 ఏళ్లు కాగా, అలెక్స్‌కు 45 సంవత్సరాలు.

ముగ్గురితో విడిపోయిన తర్వాత అలెక్స్ రోడ్రిగ్జ్‌తో 2017లో డేటింగ్ ప్రారంభించింది. మార్చి 2019లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నట్టు ప్రకటించారు. పెళ్లికి ముందు అలెక్స్‌తో విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. దాంతో వారి రిలేషన్‌షిప్ బ్రేకప్ అయింది. అయితే వారిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకొన్నారని హాలీవుడ్ పత్రిక తమ కథనంలో వెల్లడించింది.