»   » పెళ్శిరోజు కత్తిలాగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఫిట్ నెస్ చేస్తున్న సింగర్

పెళ్శిరోజు కత్తిలాగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఫిట్ నెస్ చేస్తున్న సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ అందాల రాశి, సింగర్ జెస్సికా సింప్సన్, యన్ యఫ్ యల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్ ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్శి చేసుకోబోతున్న ఈజంట ప్రస్తుతం చాలా ఆనందంలో మునిగితేలుతుంది. జెస్సికా సింప్సన్ తన పెళ్శి గురించి ఎన్నో కలలు కనడమే కాకుండా పెళ్శిలో చాలా అందంగా, నాజుగ్గా కనిపించడం కోసం సెలబ్రిటీ ట్రైనర్ అయినటువంటి ట్రేసీ ఆండర్సన్‌ని తనకి సహాయకురాలుగా నియమించుకుంది.

ఇక ట్రేసీ ఆండర్సన్‌ విషయానికి వస్తే గతంలో పాప్ సింగర్ మడోన్నా, స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్‌లకు ఫిట్ నెస్ గురుగా వ్యవహారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సింగర్ జెస్సికా సింప్సన్‌కి కూడా దగ్గరుండి మరీ వర్క అవుట్స్ చేయిస్తున్నారు. వారానికి డైబ్బైఅయిదు నిముషాలపాటు వర్క్ అవట్స్ తోపాటుగా, డాన్స్ ఎరోబిక్స్, మనసుకి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా వేయిస్తున్నట్లు సమాచారం.

ఇలా చేయడానికి కారణం జెస్సికా సింప్సన్ త్వరలో ఎరిక్ జాన్సన్‌ని వివాహాం చేసుకోబోతున్నారు. వివాహానికి అనుగుణంగా తన శరీరం ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నానని తెలిపారు. ఇక ట్రైనర్ ట్రేసీ ఆండర్సన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జెస్సికా సింప్సన్ ఎరోబిక్స్ చేయడంలో దూసుకుపోతున్నారు. పెళ్శి నాటికల్లా జెస్సికా సింప్సన్‌ని కత్తిలాగా తయారు చేస్తానని అని అన్నారు.

English summary
Jessica Simpson has hired celebrity trainer Tracy Anderson to help her get in shape for her big day. Anderson, the fitness guru to Madonna and Jennifer Aniston, told US magazine.com that she has Simpson doing 75-minute, four-day-a-week workouts, including dance aerobics and strength training.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu