»   » తమ వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చారని మీడియాపై కేసులు..!!

తమ వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చారని మీడియాపై కేసులు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ మరణానంతరం ఆయన్ని కడసారిగా ఒక్కసారి చూడాలని ఎంతో మంది ఆరాటపడ్డారు. అందులో కొందరికే ఆయన్ని చూసే అవకాశం వచ్చింది. కానీ ఆయన మృతదేహానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చి వారి కోరికను తీర్చాయి. దీంతో మీడియా వారు కూడా ఎక్స్ క్లూజివ్ గా మేము తీసిన ఫొటోలు అంటూ హెడ్ లైన్ పెట్టిమరీ ఈ ఫొటోలను విడుదల చేసాయి. కానీ ఇప్పుడవే వారికి అడ్డం తిరుగుతాయని అస్సలు ఊహించి వుండరు వారు.

తాజా సమాచారం ఏంటంటే మైఖేల్ కు చికిత్స అందిస్తున్నప్పటి ఫొటోలు, మృతి చెందినప్పటి ఫొటోలు తమ అనుమతి లేకుండా తీసి, అన్ని పత్రికల్లో ప్రచురించి తమ వ్యక్తిగత విషయాలను బజారున పెట్టారని మైఖేల్ జాక్సన్ తండ్రి జో జాక్సన్ మీడియా మీద కేసులు పెట్టాడట. వెంటనే వారందరి మీదా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడట. ఈ వార్త విన్న పత్రికలు మాత్రం ఆయన వాదనను కాదనలేక, అవుననలేక కిక్కురుమని వుండిపోయాయట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu