Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాకీ డైరెక్టర్ జాన్ ఇకలేరు.. సిల్వెస్టర్ స్టాలెన్ దిగ్భ్రాంతి..
ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జాన్ అవిల్డ్సెన్ ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం లాస్ ఎంజెలెస్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. రాకీ, కరాటే కిడ్ చిత్రాలతో ఆయన సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన మృతిపై ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలెన్, ఇతర హాలీవుడ్ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

రాకీ సంచలన విజయం
సిల్వెస్టర్ స్టాలెన్‌తో జాన్ అవిల్డ్సెన్ రూపొందించిన రాకీ చిత్రం అప్పట్లో సంచలనం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌గా తీసిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన రాకీ సినిమా హాలీవుడ్ సినిమా చరిత్రను తిరుగరాసింది. ఆ చిత్రంతో జాన్ హాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా మారారు.

రాకీ ఆస్కార్ అవార్డుల పంట
రాకీ చిత్రం కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల పరంగా కూడా సెన్సేషనల్‌గా మారింది. 1976లో రాకీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు లభించింది. అంతేకాకుండా అవిల్డ్సెన్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకొన్నాడు.

ఓవర్‌నైట్‌లో స్టాలెన్ స్టార్ హీరోగా
అనామకుడైన సిల్వెస్టర్ స్టాలెన్‌ను రాకీ చిత్రం ద్వారా ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోగా మార్చారు. రాకీ చిత్రాన్ని అప్పట్లో కేవలం పది లక్షల డాలర్లతో నిర్మించాడు. ఈ చిత్రాన్ని కేవలం 28 రోజుల్లోనే రూపొందించడం విశేషం. ఆ తర్వాత రాకీ సీక్వెల్స్ కూడా వచ్చాయి.

పలువురు సంతాపం
రాకీ దర్శకుడి మృతిపై సిల్వస్టర్ స్టాలెన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. స్వర్గంలో కూడా ఆయన త్వరలో హిట్ చిత్రాలను తీస్తారు అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పలువురు హాలీవుడ్ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నెమరువేసుకొన్నారు.

కనకవర్షం కురిపించిన కరాడే కిడ్
1984లో అవిల్డ్సెన్ దర్శకత్వం వహించిన ది కరాటే కిడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ఆ తర్వాత 1986లో తీసిన ది కరాటే కిడ్ పార్ట్2, ది కరాటే కిడ్ పార్ట్3 చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. అప్పట్లో కరాటే కిడ్ చిత్రం గురించి ప్రపంచ మీడియా ప్రశంసలు గుప్పించింది. జాన్ దర్శకత్వ ప్రతిభను కొనియాడింది.