»   » హాలీవుడ్ హీరో జానీ డెప్ కు...పదేళ్లు జైలు శిక్ష?

హాలీవుడ్ హీరో జానీ డెప్ కు...పదేళ్లు జైలు శిక్ష?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిడ్నీ : పైరైట్స్ ఆఫ్ కరేబియిన్ చిత్రాల హీరో జానీ డెప్ ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఆయన ఆస్ట్రేలియాకు...తన రెండు కుక్కలను తన సొంత జెట్ ప్లెయిన్ లో తీసుకువెళ్లారు. వాటిని అక్కడే ఉన్న గ్రూమర్ దగ్గరకు తీసుకువెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆస్ట్రైలియా సెనేట్ కమిటీ సీరియస్ అయ్యింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Johnny Depp could face 10 years in prison for taking his dogs to Australia

చట్టబద్దంగా ఫర్మిషన్ లేకుండా తమ దేశంలోకి తీసుకు వచ్చినందకు..దీన్ని నేరంగా పరిగణించింది. కోర్టుకు ఈ విషయాన్ని తీసుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. అదే కనుక జరిగితే...జానీ డెప్ కు .....పదేళ్ళ జైలు శిక్ష లేదా AU$340,000 (£172,000) ఫైన్ ని విధించే అవకాసం ఉంది. అక్కడ ప్రభుత్వ అధికారులు..దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని మీడియాకుతెలియచేసారు.

రెండు రోజుల్లో ఆ కుక్కలను తమ దేశం నుంచి పంపించివేయకపోతే...వాటిని ...మెర్సీ కిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అని అక్కడ అధికారులు చెప్పుతున్నారు. దాంతో జానీ డెప్ భార్య ఆంబర్ హెర్డ్ ఆ రెండు కుక్కలు(పిస్టల్ మరియు బూ) ను తీసుకుని...కాలిఫోర్నియా కు వెళ్లినట్లు సమాచారం. 

English summary
After illegally bringing his two dogs to Australia, Johnny Depp could face up to 10 years behind bars.
Please Wait while comments are loading...