‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ హీరోకు గాయాలు
సిడ్నీ: హాలీవుడ్ సినిమా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లో ప్రధాన పాత్రలో అద్బుతమైన నటనను కనబరిచిన ప్రముఖ హాలీవుడ్ నటుడు, జానీ డిప్‌కు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో గాయాలయ్యాయి.

ఫైరేట్స్ ఆఫ్ కరేబియన్ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొనసాగుతుంది. గోల్డ్ కోస్ట్ తీరంలో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో జానీకి గాయాలయ్యాయని చిత్ర బృందం ప్రతినిధి తెలిపారు.
గాయాలనుంచి త్వరగా కోలుకునేందుకు చికిత్స కోసమై ఆయన యూఎస్‌కు తిరిగి వెళ్లనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా ఫైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో వస్తున్న ఐదో సినిమా.


Click it and Unblock the Notifications