»   » ఆమెతో నటించడం ఓ అద్భుత అనుభవం

ఆమెతో నటించడం ఓ అద్భుత అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకరు ప్రపంచంలోనే అందమయిన యువతి, మరొకరు ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ పర్సన్. వారిద్దరూ జతకడితే ఎలా వుంటుంది. అద్భుతంగా వుంటుంది, కన్నుల పండువగా వుంటుంది..! ఈ అద్భుతం త్వరలోనే మనముందు సాకారమవబోతోంది. 'ది టూరిస్ట్' సినిమా ద్వారా.. ఇందులో ఏంజలీనా జోలీ, జానీ డెప్ కలసి నటించనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఈ సినిమా షూటింగ్ నిమిత్తం వెనీస్ లో వున్నారు.

ఈ సందర్భంగా జానీ డెప్ మాట్లాడుతూ ఏంజలీనా జోలీ ఎంతో అందమయిన యవతి అని ఆకాశానికి ఎత్తేసాడు. నేనింతవరకూ జోలీని వ్యక్తిగతంగా కలవకపోయినా ఆమె గురించి చాలా విన్నాను. ఇప్పుడు ఆమెతో కలసి పనిచేస్తున్నాను. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఆమె ఓ కదిలే బొమ్మలాగా వుంటుంది. తన భర్త, పిల్లల మీద ఆమె చూపే ప్రేమ ఎంతో ఆప్యాయంగా వుంటుంది అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య హాట్ హాట్ సన్నివేశాలు వున్నట్టు వినికిడి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu