»   » జెన్నిఫర్ అనిస్టాన్ పై చేయి సాధించిన ఏంజలీనా జోలీ..!!

జెన్నిఫర్ అనిస్టాన్ పై చేయి సాధించిన ఏంజలీనా జోలీ..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో ఏంజలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టాన్ లు ఏం చేసినా వారిద్దరి మధ్య పోటీగా భావిస్తారు అక్కడి అభిమానులు. దీనికి కారణం వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతటి విరోధం వుండటమే. జెన్నిఫర్ అనిస్టాన్ తో హాయిగా కాపురం చేసుకుంటున్న బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీని కలిసాక ఆమె వైపు ఆకర్షితుడై అనిస్టాన్ ను వదిలేసి ఏంజలీనాను పెళ్లిచేసుకున్న దగ్గర్నుంచీ వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రతిసారీ ఏంజలీనాయే పైచేయి సాధిస్తూ వస్తోంది. కాగా ఇటీవల వ్యానిటీ ఫెయిర్ మ్యాగ్జయిన్ నిర్వహించిన సర్వేలో గత ఏడాది ఏంజలీనా, అనిస్టాన్ కన్నా మినియన్ డాలర్లు ఎక్కువగా సంపాదించిందట. ఇందులో ఏంజలీనా తను నటిస్తున్న సాల్ట్ సినిమాకు గాను 20 మిలియన్ డాలర్ల పారితోషికంతో కలిపి మొత్తం 21 మిలియన్ డాలర్లను సంపాదించగా, అనిస్టాన్ 'ది బౌంటీ హంటర్', 'ది బాస్టర్' సినిమాలలో ఒక్కో సినిమాకు 8 మిలియన్ డాలర్ల చొప్పున 20 మిలియన్ డాలర్లను సంపాదించినట్టు సదురు పత్రికా కథనం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu