»   » పిల్లల కోసం అలా చేశాను అది తప్పా: ఏంజిలీనా జోలి

పిల్లల కోసం అలా చేశాను అది తప్పా: ఏంజిలీనా జోలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ అందాల జంట బ్రాడ్ పిట్ మరియ ఏంజిలీనా జోలి. ఏంజిలీనా జోలి ఏమి చేసినా అందులో విషయం ఉంటుంది. బోస్టాన్ లో మనీబాల్ షూటింగ్ లో ఉన్న బ్రాడ్ పిట్ తో ఒక్కమాట కూడా చెప్పకుండా పిల్లలను తనతోపాటు ప్రస్తుతం షూటింగ్ లో పాల్గోనడానికి హాంగేరి వెళ్శింది. ఏంజిలినా జోలి సడన్ గా ఫ్రెంచి-అమెరికన్ స్కూల్లో ప్రత్యక్షమయ్యే సరికే అభిమామనులంతా అవాక్కయ్యారు. దీనిపై ఏంజిలీనా జోలి మాట్లాడుతూ మీరు ఏమి భయపడనవసరం లేదు. నేను స్కూలుకి రావడానికి కారణం మా పిల్లలను ఈ ఫ్రెంచి-అమెరికన్ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాను అంతే. వచ్చే వారం నుండి నా కూతుళ్శు జహారా మరియు షైలో ఇద్దరు స్కూలుకి హాజరవుతారని అన్నారు.

అంతేకాకుండా ఈ స్కూలు చిన్నపిల్లల స్కూలు అని అన్నారు. ఈ ఫ్రెంచి-అమెరికన్ స్కూలు ఎక్కడుంది అనుకుంటున్నారా హాంగేరి రాజధాని లోని బుదాపెస్ట్ లో ఉంది. బుదాపెస్ట్ పరిసర ప్రాంతాల్లో త్వరలో మేము ఒక ఇల్లు కూడా తీసుకోబోతున్నామని అన్నారు. అక్కుడున్న లోకల్స్ తో ఏంజిలినా జోలి ఇప్పటినుండే బాగా కలసిమెలసి పోవడం అక్కడ కోంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. చివరగా కోస మెరుపు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరితో ఏంజిలినా జోలి షేకే హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకునేంతవరకు అక్కడున్నవారికి ఈమె ఎవరో తెలియలేదంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu