»   » నాజీవితంలో కొన్ని రోజులు ఆఫ్రికాలో జీవించాలంటున్న సూపర్ స్టార్..

నాజీవితంలో కొన్ని రోజులు ఆఫ్రికాలో జీవించాలంటున్న సూపర్ స్టార్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ స్టార్, అందాల తార ఏంజిలీనా జోలీ రాబోవు కాలంలో తను ఎప్పుడైనా ఆఫ్రికాకు వెళ్శవచ్చునని ఇటీవలే తన మనసులోని మాటను వెల్లడించారు. ఏంజిలీనా జోలి మాట్లాడుతూ నాజీవితంలో నేను ఇక సినిమాలు తీయలేనప్పుడు, నాకెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు నాజీవితం నాభర్త నాపిల్లలతో ఆఫ్రికాలో గడపాలని అనుకుంటున్నట్లు వివరించారు. జీవితంలో వయసు పెరిగేకోద్ది మనం చేసేటటువంటి పనిలో మనం కోద్దిగా వెనకపడుతుండడం సహాజం. అంటే అది జీవితానికి రిటైర్ మెంట్ అని నేను అనుకోవడం లేదు. జీవితంలో చివరి దశకు వెళుతున్నప్పుడు మనం కొన్ని సినిమాలు మాత్రమే తీయగలం. వయసులో చేసినటువంటి సినిమాలు తీయాలంటే కష్టం అని అన్నారు.

ఇక నిజం చెప్పాలంటే నాజీవితంలో కొంత కాలం నేను ఆఫ్రికాలో జీవించాలని అనుకుంటున్నాను. అంతేకాదు ఎగురుతున్న విమానాల్లో విహారించాలని కోరిక కూడా ఉంది. ఒక ఆర్టిస్ట్ గాఅక్కడ చేయాల్సిన వేరే పనులు కూడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఏంజిలీనా జోలి తన ఆరుగురు పిల్లలు మరియ భర్త బ్రాడ్ పిట్ తోకలసి సహాజీవనం సాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏంజిలీనా జోలి కోరిక మేరకు ప్రపంచంలో ఎంతోమందికి ఆపదలో ఉన్నప్పుడు తనవంతు సహాయం అందించింది. అలాగే ఆఫ్రికాలో కూడా ఎవరికైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారేమో అందుకే తన శేషజీవితం అక్కడ గడపాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu