»   » నైట్ క్లబ్ లో లేట్ నైట్ లో అల్లరిపాలయింది

నైట్ క్లబ్ లో లేట్ నైట్ లో అల్లరిపాలయింది

Subscribe to Filmibeat Telugu

లండన్ కు చెందిన మోడల్ క్యాటీ ప్రైజ్ తన భద్రతా సిబ్బందిని పెంచనుంది. గత వారాంతంలో క్యాటీ, తన భర్త అలెక్స్ రెయిడ్ ఓ నైట్ క్లబ్ కు వెళ్లినప్పుడు అర్థరాత్రి తిరిగి వస్తుండగా కొందరు అగంతకులు క్యాటీని చుట్టు ముట్టి అల్లరి చెయ్యబోయారట. దీంతో ఆమె ధిగ్బాంతికి గురయిందట. వెంటనే తేరుకుని గట్టిగా అరవడంతో తన భర్త మరికొంత మంది వచ్చి రక్షించారట. దీంతో ఆమె ఊపిరిపీల్చుకుందట.

క్యాటీ ప్రైజ్ బ్రిటన్ లో అత్యధికులు అసహ్యించుకునే వ్యక్తిగా ఎంపికవడానికి తోడు..ఆమె మీద చాలా మంది దాడులకు యత్నించడం లాంటి చర్యలు ఆమెను కలవరపరుస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పటివరకూ ఒక్కరే వున్న భద్రతా సిబ్బందిని పెంచాలనే నిర్ణయం తీసుకుందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu