»   » స్పీల్ బర్గ్ సినిమాలో జుహీచావ్లా

స్పీల్ బర్గ్ సినిమాలో జుహీచావ్లా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Juhi Chawla for Spielberg-produced 'The Hundred-Foot Journey'
లాస్ ఏంజిల్స్ : ఉత్తమ దర్శకునిగా నాలుగు సార్లు ఆస్కార్‌ బహుమతికి నామినేట్‌ అయిన హాలీవుడ్‌ దర్శకుడు లెస్సీ హాల్‌స్ట్రాంతో, మరో ఆస్కర్‌ అవార్డు గ్రహీత స్టీవెన్‌ స్పీల్బెర్గ్‌ సమర్పిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది హండ్రెడ్‌ ఫుట్‌ జర్నీ'లో నటించే అవకాశం జుహీ చావ్లాకు దక్కింది. జుహీచావ్లా రొట్టె విరిగి నేతిలో పడింది.


రిచర్డ్‌ సి.మొరాయిస్‌ నవలని అదే పేరుతో సినిమాగా తీస్తున్నారు. బొంబాయిలో హోటల్‌ నడుపుతూ కష్టాల మధ్య ఫ్రాన్సు దేశానికి వలస వెళ్లి ఓ కుగ్రామంలో ఫ్రెంచి వనిత నడుపుతున్న హోటల్‌కి ఎదురుగా నూరు అడుగుల దూరంలో ఒక హోటల్‌ తెరచి ఆ గ్రామస్తులకి భారతీయ వంటలు రుచి చూపించిన కథ ఇతివృత్తం.

ఓం పూరి భార్యగా జుహీచావ్లా నటించనున్న ఈ సినిమా ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌ దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. సినిమాలో కొంత భాగాన్ని ఇటీవల బొంబాయిలో చిత్రీకరించారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి హెలెన్‌ మిర్రెన్‌, మేడం మల్లోరిగా నటించనుంది. అమెరికా దేశంలో వాల్ట్‌ డిస్నీ స్టూడియో; యూరప్‌, ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు ఈ సినిమాని 2014 ఆగస్టు 8న విడుదల చేయనున్నాయి.

English summary

 Juhi Chawla has been cast in the Steven Spielberg-produced film The Hundred-Foot Journey. The movie tells the story of an Indian family who relocate to a small village in France, where they open an Indian restaurant opposite a French one run by a woman named Madame Mallory, played by Helen Mirren.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu