»   »  ముందుగా మన దేశంలోనే రిలీజ్...కారణం?

ముందుగా మన దేశంలోనే రిలీజ్...కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : డిస్నీ సంస్ధ తమ తాజా చిత్రం ‘జంగిల్‌బుక్‌'ను మిగతా అన్ని దేశాలకన్నా ముందే ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదో శుభపరిణామని హాలీవుడ్‌ పరశ్రమ చెప్తున్నా, ఇలా చేయటం వెనక అసలు లాజిక్ ఏమిటి...అనేది ఇప్పుడు సినీ గోయిర్స్ లో చర్చనీయాంశంగా మారింది.

నిజంగా... డిస్నీ సంస్థకు మన దేశం ప్రేక్షకుల విలువ ఏమిటో తెలియవచ్చిందనుకోవాలా అంటున్నారు. ఎందుంకంటే...ప్రపంచంలోని మిగతా దేశాల ప్రేక్షకులతో పోలిస్తే, మన దేశ ప్రేక్షకులకు సినిమాలంటే చాలా ఇష్టం అన్నది వీరు గుర్తుంచి, పెద్ద మార్కెట్ గా భావించే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

అయితే ఇలా హాలీవుడ్ చిత్రాలు మొదట ఇక్కడ రిలీజ్ చేయటం మొదలవటం ఆగితే ఫర్వాలేదు..హాలీవుడ్ నిర్మాతలు సైతం ఇక్కడ సినిమాలు తీయటం మొదలెడితేనే మన మార్కెట్ కు దెబ్బ. మన సినిమాలు మనుగడ కోల్పోతాయి. ప్రపంచ స్దాయి టెక్నాలిజీ మనకు అందినట్లే ఉన్నా...మనకంటూ సినిమాలు మిగలవు అని కొందరు అంటున్నారు.

'Jungle Book' will be hitting Indian theatres a week before the US

అయితే హాలీవుడ్ సినిమా సంస్ధలు వీటిని కొట్టిపారేస్తున్నాయి. జంగిల్‌బుక్‌' పుస్తకాన్ని రాసిన రుద్వార్డ్‌ కిప్లింగ్‌ మన దేశంతో ప్రత్యేక అనుబంధం ఉండటమే..ఇక్కడ రిలీజ్ చేయటానికి కారణం..ఎక్కవ ఊహించవద్దు అంటున్నాయి.

మౌగ్లీ, భాలూ, కా, బగీరా, షేర్‌ఖాన్‌ వంటి అనేక సుపరిచిత పాత్రలతో ఉండే ఈ కొత్త ‘జంగిల్‌బుక్‌'కు బెన్‌ కింగ్‌స్లే, బిల్‌ ముర్రే, స్కార్లెట్‌ జొహాన్సన్‌, క్రిస్టోఫర్‌ వాకెన్‌ వంటి ప్రముఖ తారలు గాత్రదానం చేశారు. మిగతా ప్రపంచంకన్నా ముందుగా మన దేశంలో ఈ చిత్రం విడుదలతో కొత్త అధ్యాయం ఆరంభం అవుతోందని అనుకోవచ్చు.

English summary
The Jungle Book,' starring 12-year-old Indian-American Neel Sethi as Mowgli, will release in India on April 8, a week before it releases in the USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu