మరోసారి రాక్షసి బల్లులతో స్టీఫెన్ స్పీల్‌బర్గ్
డైనోసార్ల ప్రధాన పాత్రలో 1993లో స్పీల్ బర్గ్ రూపొందించిన 'జురాసిక్ పార్క్" చిత్రం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అయిందో తెలుసు. ఆ తర్వాత 'జురాసిక్ పార్క్" సీక్వెల్స్ గాటూ, త్రీ వచ్చి అంతే రేంజిలో హిట్టయ్యాయి. ఇప్పుడు 'జురాసిక్ పార్క్ - 4"చిత్రం ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రం స్పెషాలిటి ఏంటంటే ఈ చిత్రానికి స్పీల్ బర్గే డైరక్ట్ చేయనున్నారు. ఎందుకంటే స్పీల్ బర్గ్ 'జురాసిక్ పార్క్-3"ని ఆయన డైరక్ట్ చేయలేదు. ఈ చిత్రానికి స్పీల్‌బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మాత్రమే వ్యవహరించారు. జో జాన్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దాంతో 'జురాసిక్ పార్క్ - 4"మంచి క్రేజ్ వస్తోంది.
ఇక స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ది అడ్వంచరస్ ఆఫ్ టిన్ టిన్" త్వరలో విడుదల కానుంది. ది అడ్వంచరస్ ఆఫ్ టిన్ టిన్ కామిక్ పుస్తకాల్లోని మూడు కథలను ఆధారం చేసుకుని స్పీల్‌బర్గ్ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు ఈ చిత్రం గురించి చర్చలు జరగడంతోపాటు మరోవైపు ఆయన దర్శకత్వం వహించబోయే 'జురాసిక్ పార్క్ - 4" చిత్రం గురించి కూడా హాలీవుడ్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











