'జురాసిక్ వరల్డ్' :రాక్షస బల్లుల్లో ఇన్ని రకాలా? (ఫొటోలు)
న్యూయార్క్ : స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్ పార్క్...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్ వరల్డ్' పేరుతో మరో కొత్త సీక్వెల్ తెరకెక్కుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సినిమాను వైవిధ్యమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ తాజా చిత్రం కోసం 7 రకాల కొత్త తరహా డైనోసార్‌లను రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన నమూనాలను సైంటిస్టులు తయారు చేసిన విధానాన్ని జురాసిక్ వరల్డ్ వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోల రూపంలో సినిమా అభిమానులకు అందిస్తున్నారు.
డైనోసార్లు మళ్లీ పుట్టాయేమో అన్నంత సహజంగా ఉన్న ఆ జీవులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోతున్నారట. జురాసిక్ పార్క్ సందర్శకులకు ఈ కొత్త జీవులను చూసే అవకాశం కల్పించడం విశేషం. ఈ చిత్రాన్ని అమెరికాలో జూన్ 12న విడుదల చేస్తున్నారు.
స్లైడ్ షోలో... ఫొటోలు

Dimorphodon
దీని అర్దం : "Two-form tooth"
ఆహారం : చేపలు,పురుగులు
వయస్సు :మిడ్ జురాసిక్
8 ft
3 lbs

Edmontosaurus
దీని అర్దం: "Edmonton Lizard"
ఆహారం: పళ్లు, కూరగాయలు
వయస్సు: Cretaceous

Suchomimus
దీని అర్దం: "Crocodile mimic"
ఆహారం:Carnivore
వయస్సు: Cretaceous

Metriacanthosaurus
దీని అర్దం: "Moderately-Spined Lizard"
ఆహారం:Carnivore
వయస్సు: Mid-Jurassic

Microceratus
దీని అర్దం: "Small-horned"
ఆహారం: Herbivore
వయస్సు:Cretaceous

Pteranodon
దీని అర్దం: "Toothless wing"
ఆహారం:Primarily fish
వయస్సు: Late Cretaceous
ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది.


Click it and Unblock the Notifications











