»   »  ‘జూరాసిక్ వరల్డ్’ మూవీ మేకింగ్... (వీడియో)

‘జూరాసిక్ వరల్డ్’ మూవీ మేకింగ్... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూరాసిక్ పార్క్.... సిరీస్ సినిమాలు ఇప్పటికే మూడు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. నిర్మాతలకు వేల కోట్ల లాభాలు తెచ్చి పెట్టాయి. చాలా కాలం తర్వాత ఈ సిరీస్‌లో 4వ చిత్రం ‘జురాసిక్ వరల్డ్' ఇటీవల విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. భారత్ లో ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లు వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల కోట్లకు పైగా వసూలు చేసి మరోసారి నిర్మాతకు కాసుల పంట పండించింది.

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించారు. క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించాడు.

Jurassic World 2015 Behind the full movie Scenes

జూరాసిక్ పార్క్ సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ మాయా జాలమే ఉంటుంది. సినిమాలో జూరాసిక్ పార్క్ అనేది ఒక ఐలాండ్ అని చూపించిచినా.... అదంతా ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరిపిన షూటింగ్. అసలు ఇలాంటి సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుంది? అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే.... ఈ మేకింగ్ వీడియో చూడాల్సిందే

English summary
Watch jurassic world full movie 2015 - jurassic park 4 - behind the scenes B-Roll Footage - Chris Pratt, Jake Johnson HD.
Please Wait while comments are loading...