»   » రాకాసి బల్లుల 'జురాసిక్‌ వరల్డ్‌' స్టోరీ లైన్ ఇదే

రాకాసి బల్లుల 'జురాసిక్‌ వరల్డ్‌' స్టోరీ లైన్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ :క్రిష్‌ ప్రాట్‌, బ్రైస్‌ డల్లాస్‌ హోవార్డ్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌' . కొలిన్‌ ట్రెవ్రో దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని (ట్రైలర్‌) చిత్రబృందం విడుదల చేసింది. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం ఆ తర్వాత పరిణామాలను తెలుపుతూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. అమెరికాలో జూన్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటి... అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఓ సెలవు రోజు సరదాగా జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌కు రాకాసి బల్లులను చూద్దామని వస్తారు కొందరు సందర్శకులు. పార్క్‌ అంతా సందర్శకులతో కోలాహలంగా ఉన్న సమయంలో అనుకోని విధంగా రాకాసి బల్లులు ఉగ్రరూపం దాలుస్తాయి. అసలేమైంది... ఆ రాకాసి బల్లులు అలా ఎందుకు మారాయన్నది 'జురాసిక్‌ వరల్డ్‌' చూసి తెలుసుకోవాల్సిందే. జురాసిక్‌ పార్క్‌ను ప్రేక్షకుల సందర్శన కోసం తిరిగి ప్రారంభించడానికి యాజమాన్యం కృత్రిమంగా డైనోసర్‌ను సృష్టిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ జీవి వారి అధీనం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే పరిణామాల మాలిక ఈ చిత్రం.

ప్రతిష్ఠాత్మక 'జురాసిక్‌ పార్క్‌' సిరీస్‌లో భాగంగా వస్తోన్న నాలుగో చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌'. క్రిష్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌యజమాని సైమన్‌ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్‌.

స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్‌ వరల్డ్‌' పేరుతో మరో కొత్త సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా పోస్టర్ పై ఇర్ఫాన్ ఖాన్ ని వేసి పబ్లిసిటీ ప్రారంభించారు.

 ‘Jurassic World’ Director Offers New Plot Details

మరో ప్రక్క ఈ సినిమాను వైవిధ్యమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ తాజా చిత్రం కోసం 7 రకాల కొత్త తరహా డైనోసార్‌లను రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన నమూనాలను సైంటిస్టులు తయారు చేసిన విధానాన్ని జురాసిక్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోల రూపంలో సినిమా అభిమానులకు అందిస్తున్నారు.

డైనోసార్లు మళ్లీ పుట్టాయేమో అన్నంత సహజంగా ఉన్న ఆ జీవులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోతున్నారట. జురాసిక్‌ పార్క్‌ సందర్శకులకు ఈ కొత్త జీవులను చూసే అవకాశం కల్పించడం విశేషం.

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
A man-made dinosaur terrifies tourists at a theme park. This is Jurassic World, Film synopsis. Jurassic World will be in theaters on June 12, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu