»   » హాలీవుడ్ చిత్రం డబ్బింగ్ రైట్స్ కి 2.5 కోట్లు

హాలీవుడ్ చిత్రం డబ్బింగ్ రైట్స్ కి 2.5 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్ట్రైయిట్ గా రిలీజ్ చేస్తున్న సినిమాలకన్నా చాలా సార్లు డబ్బింగ్ సినిమాలే ఎగ్జిబిటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ డబ్బు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ డబ్బింగ్ లు ఇక్కడ మన దేశంలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. దాంతో ఆ బిజినెస్ వైపు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు నటించే సినిమాకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతూండటం సహజం. కానీ ప్రస్తుతం ఓ హాలీవుడ్‌ చిత్రం తమిళ,తెలుగు హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆ సినిమాకు కోట్లలో చెల్లించడానికి సిద్ధమవుతున్నారు.. ఇంతకీ అదేం సినిమా అంటారా?.. 'జురాసిక్‌ వరల్డ్‌'.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు తెలుగు,తమిళంలో మార్కెట్‌ బాగా ఉంది. 'అవెంజర్స్‌', 'పాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌' వంటి కొన్ని చిత్రాల వసూళ్లు మన నిర్మాతలను ఆశ్చర్యపరిచాయి. దీంతో జూన్‌ 12న విడుదలకు సిద్ధమవుతున్న 'జురాసిక్‌ వరల్డ్‌'పై నిర్మాతలంతా దృష్టి పెట్టారు.

Jurassic world dubbing rights high

తమిళనాడు హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుండటంతో.. రూ.లక్షల్లో అమ్మదలచుకున్న సదరు నిర్మాణ సంస్థ రూ.కోట్ల పాట అందుకుంది. దీంతో ఓ ప్రముఖ సంస్థ రూ.2.5 కోట్లు చెల్లించడానికి కూడా సిద్ధమైనట్లు తాజా సమాచారం. అలాగే తెలుగులో సైతం ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద పోరాటమే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

క్రిష్‌ ప్రాట్‌, బ్రైస్‌ డల్లాస్‌ హోవార్డ్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌' . కొలిన్‌ ట్రెవ్రో దర్శకుడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం ఆ తర్వాత పరిణామాలను తెలుపుతూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. అమెరికాలో జూన్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటి... అంటే...

ఓ సెలవు రోజు సరదాగా జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌కు రాకాసి బల్లులను చూద్దామని వస్తారు కొందరు సందర్శకులు. పార్క్‌ అంతా సందర్శకులతో కోలాహలంగా ఉన్న సమయంలో అనుకోని విధంగా రాకాసి బల్లులు ఉగ్రరూపం దాలుస్తాయి. అసలేమైంది... ఆ రాకాసి బల్లులు అలా ఎందుకు మారాయన్నది 'జురాసిక్‌ వరల్డ్‌' చూసి తెలుసుకోవాల్సిందే. జురాసిక్‌ పార్క్‌ను ప్రేక్షకుల సందర్శన కోసం తిరిగి ప్రారంభించడానికి యాజమాన్యం కృత్రిమంగా డైనోసర్‌ను సృష్టిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ జీవి వారి అధీనం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే పరిణామాల మాలిక ఈ చిత్రం.

ప్రతిష్ఠాత్మక 'జురాసిక్‌ పార్క్‌' సిరీస్‌లో భాగంగా వస్తోన్న నాలుగో చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌'. క్రిష్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌యజమాని సైమన్‌ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్‌.

స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్‌ వరల్డ్‌' పేరుతో మరో కొత్త సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా పోస్టర్ పై ఇర్ఫాన్ ఖాన్ ని వేసి పబ్లిసిటీ ప్రారంభించారు.

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Jurassic World is an upcoming adventure film directed by Colin Trevorrow. It is the fourth installment in the Jurassic Park film series. The screenplay was co-written by Rick Jaffa, Amanda Silver, Derek Connolly and Trevorrow. The film stars Chris Pratt, Bryce Dallas Howard, Vincent D'Onofrio, Ty Simpkins, Nick Robinson, Irrfan Khan, and B. D. Wong. Wong is the only actor from any of the previous films to appear in Jurassic World.
Please Wait while comments are loading...