»   »  జూరాసిక్ వరల్డ్ రికార్డ్: వీకెండ్ వసూళ్లు 3 వేల కోట్లపైనే..

జూరాసిక్ వరల్డ్ రికార్డ్: వీకెండ్ వసూళ్లు 3 వేల కోట్లపైనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూరాసిక్ వరల్డ్ మూవీ అందరూ ఊహించినట్లుగానే వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాసింది. జూన్ 11న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వీకెండ్ బాక్సాఫీసు బద్దలయ్యే కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 511 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఈ లెక్క రూ. 3 వేల కోట్ల పైమాటే.

ఈ చిత్రం ఒక్క అమెరికాలోనే 204 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. చైనాలో 100 మిలియన్ డార్లు వసూలు చేసింది. యూకె, ఐర్లాండుల్లో 29.6 మిలియన్లు.....ఓవరాల్డ్ వరల్డ్ వైడ్ 511.8 మిలియన్ డాలర్లు రాట్టింది. యూనివర్సల్ పిక్చర్స్ ఈచిత్రాన్ని విడుదల చేసింది.

Jurassic World's Record Opening Weekend

ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు, డైనో సార్స్ గురించి సాగే మూవీ ‘జురాసిక్ పార్క్'. తొలిసారి 1993లో స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. అప్పట్లో ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సీరీస్ లో 3 సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాయి. తాజాగా 4వ ఎడిషన్ ‘జురాసిక్ వరల్డ్' కూడా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది.

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించారు. క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించాడు.

English summary
As expected, Jurassic World ate the global box office like a monster. In its very opening weekend, the reboot of the classic Jurassic Park has swept away the box office with a record. It is the first film to gross more than $500m world-wide in a single weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu