»   » ఉత్కంఠకు గురి చేసే ‘జూరాసిక్ వరల్డ్’ (ఫోటోస్)

ఉత్కంఠకు గురి చేసే ‘జూరాసిక్ వరల్డ్’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ సినిమాలైన ‘జురాసిక్ పార్క్' సిరీస్ చిత్రాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తొలిసారి స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. ఇప్పటికే మూడు సిరీస్ సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగో సిరీస్ రాబోతోంది. ‘జురాసిక్ వరల్డ్' పేరుతో రాబోతున్న ఈచిత్రం వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమా పబ్లిసిటీలో భాగంగా తాజాగా సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేసారు. ఈ సినిమా గతంలో వచ్చిన ఈ సిరీస్ సినిమాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌యజమాని సైమన్‌ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్‌.

ఇప్పటికే విడుదలైన ‘జురాసిక్ వరల్డ్' టీజర్, ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది.

స్లైడ్‌ షోలో జురాసిక్ వరల్డ్ చిత్రానికి సంబంధించిన ఫోటోలు....

జురాసిక్ వరల్డ్

జురాసిక్ వరల్డ్

ఇప్పటికే మూడు సిరీస్ సినిమాలు వచ్చాయి. తాజాగా విడుదలవుతున్న ‘జురాసిక్ వరల్డ్' సిరీస్ లో 4వ చిత్రం.

రిలీజ్

రిలీజ్

‘జురాసిక్ వరల్డ్' పేరుతో రాబోతున్న ఈచిత్రం వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అద్భుతమైన గ్రాఫిక్స్

అద్భుతమైన గ్రాఫిక్స్

అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనున్నాయి.

ఊహించని ట్విస్ట్స్

ఊహించని ట్విస్ట్స్

ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగనుంది.

ప్రపంచం మొత్తం

ప్రపంచం మొత్తం

ఈ సినిమా విడుదల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

ఇప్పటికే వచ్చిన 3 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

డైరెక్టర్

డైరెక్టర్

ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కోట్లాది రూపాయల ఖర్చు

కోట్లాది రూపాయల ఖర్చు

ఈ చిత్రం కోసం ఇప్పటికే వెయ్యి కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. రాబడి కూడా అదే రేంజిలో ఉంటుంది.

తెలుగులో...

తెలుగులో...

ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Jurassic World is an upcoming adventure film directed by Colin Trevorrow. It is the fourth installment in the Jurassic Park film series. Jurassic World set For English, Hindi, Tamil and Telugu release.
Please Wait while comments are loading...