Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్ళైన తర్వాత మాజీ గర్ల్ ఫ్రెండ్ వద్దకు.. బుద్ది ఉన్నవాళ్లు ఇలా మాట్లాడతారా!
స్టార్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ చిన్న వయసు నుంచే ఓ వెలుగు వెలుగుతున్నాడు. తన గాత్రంతో, అదిరిపోయే పెర్ఫామెన్స్ తో సంగీత ప్రియులని బీబర్ ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. బీబర్ తన ప్రియురాలు హెయిలీ బాల్డ్ విన్ తో చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు. గత ఏడాదే ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. బీబర్ ని వివాహం చేసుకున్నప్పటి నుంచి అతడి భార్య హెయిలీపై సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే హెయిలీ ఈట్రోలింగ్ పై స్పందించింది. అయినా నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉండడంతో స్వయంగా బీబర్ స్పందించిన ఘాటైన సమాధానం ఇచ్చాడు.

మాజీ ప్రియురాలితో పోల్చుతూ
హెయిలీ, జస్టిన్ బీబర్ వివాహం గత ఏడాది లాస్ ఏంజిల్స్ లో జరిగింది. అప్పటి నుంచి హెయిలీ నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. హెయిలీని బీబర్ మాజీ ప్రియురాలు సెలీనాతో పేల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. హెయిలీ అందవికారంగా ఉంది. ఆమెని బీబర్ ఎలా ఇష్టపడ్డాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరూ ఒకేలా ఉండరు.. ఎవరి అందం వాళ్లకు ఉంటుంది అని తనపై వస్తున్న ట్రోలింగ్ పై హెయిలీ ఇటీవల స్పందించింది.

బుద్ది ఉన్నవాళ్లు ఇలా
తన భార్యని అగౌరవ పరిచేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడంతో జస్టిన్ బీబర్ స్పందించాడు. నా భార్యని విమర్శించడానికి మీ సమయాన్ని, సోషల్ మీడియా అకౌంట్స్ ని అంకితం చేసినట్లు ఉన్నారు. ఓ అమ్మాయితో వివాహం జరిగిన తర్వాత మాజీ ప్రియురాలివద్దకు వెళాళ్లని ఎవరైనా కోరుకుంటారా.. బుద్ది ఉన్న వ్యక్తులు ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. మిమ్మల్ని మీరు చూసుకుని సిగ్గుపడండి అంటూ బీబర్ చాలా ఘాటుగా నెటిజన్లకు కౌంటర్ ఇచ్చారు.

నా భార్యే సర్వస్వం
నేను గతంలో సెలీనాని ప్రేమించిన విషయం నిజమే. ఆమెకు నా హృదయంలో ఎప్పుడూ చోటు ఉంటుంది. కానీ నాకు ప్రస్తుతం హెయిలీతో వివాహం జరిగింది. నా భార్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాయి. ఆమే నా సర్వస్వం అని బీబర్ సమాధానం ఇచ్చాడు. హెయిలీ అందవికారంగా ఉంది.. బీబర్ కు సెలీనానే సరైన జోడి అని కామెంట్స్ చేస్తున్నవారికి నేనిచ్చే సమాధానం ఇదే. నా భార్య హెయిలీ నా జీవితం. నేను ఏం చేయాలో మీరు చెప్పనవసరం లేదు. నా అభిప్రాయాలకు విలువ ఇవ్వని వాళ్ళు నా అభిమానులే కాదు అంటూ బీబర్ వ్యాఖ్యానించాడు.

విభేదాలతో విడిపోయి
హెయిలీ పరిచయం కాకముందు బీబర్ తన కో సింగర్ సెలీనాని ప్రేమించారు. కొంత కాలం వీరి మధ్య రిలేషన్ కొనసాగింది. కానీ విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత బీబర్ ప్రముఖ మోడల్ హెయిలీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి హెయిలీ అసలేం బాగాలేదు. ఆమెకన్నా సెలీనా అందగత్తె. సెలీనానే బీబర్ కు సరైన జోడి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీబర్ తన భార్యని విమర్శించే వాళ్ళ నోర్లు మూయించాడు.