»   » నమ్మొచ్చా?.... తాగుడు, డ్రగ్స్ అన్నీ మానేసాడట!

నమ్మొచ్చా?.... తాగుడు, డ్రగ్స్ అన్నీ మానేసాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు తప్పతాగి గొడవలు చేస్తూ, వాహనాలు నడుపుతూ......చట్టవిరుద్ధమైన డ్రగ్స్ సేవిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్లో అయితే ఈ పోకడ మరీ ఎక్కువైంది. అక్కడి సెలబ్రిటీల్లో ఎక్కువ శాతం ఈ రెండు అలవాట్లకు బానిసైన వారే ఉంటున్నారు.

అలాంటి వారిలో అమెరికన్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఒకరు. గతంలో బీబర్ అనేక సందర్భాల్లో మద్యం సేవించి గొడవల పడి, డ్రగ్స్ సేవిస్తూ దొరికి పోయాడు. అయితే ఇదంతా గతం, ఇపుడు తాను చాలా మారిపోయాను అంటున్నాడు బీబర్. గతంలోనూ జస్టిన్ బీబర్ ఇలాంటి మాటలు చాలానే చెప్పాడు. అయితే ఈ సారి మాత్రం అలా కాదు, గట్టిగా నిర్ణయించుకున్నాను అంటున్నాడు. చూద్దాం ఈ కుర్రోడు తన మాటను ఎంత కాలం నిలబెట్టుకుంటాడో?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Justin Bieber quits drink and drugs?

ప్రియురాలిని మార్చాడు...
జస్టిన్ బీబర్ తన పాత ప్రియురాలు, సింగర్ సెలీనా గోమెజ్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కుర్రాడు మరో అమ్మాయితో ఎఫైర్ మొదలు పెట్టాడు. గత కొంత కాలంగా మోడల్ హెయిలీతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వస్తున్న వస్తున్నాయి. తాజాగా ఇద్దరూ ఓ స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలు ఆడుతూ మీడియాకు చిక్కారు.

స్విమ్మింగ్ ఫూల్‌లో ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపించారు. హెయిల్ వైపును ముద్దాడుతూ....ఆమెకు మసాజ్ చేస్తూ జస్టిన్ బీబర్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటులు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో ఈ విషయం క్షణాల్లో అందరికీ తెలిసి పోయింది.

జస్టిన్ బీబర్ ప్రస్తుతం అమెరికన్ యువ పాప్ స్టార్లలో టాప్ 10లో ఉన్నాడు. త్వరలో మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ తో కలిసి ఓ ఆల్బం చేయబోతున్నాడు. జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

జస్టిన్ బీబర్ కెరీర్ విషయానికొస్తే....ప్రస్తుతం అమెరికన్ యువ పాప్ స్టార్లలో టాప్ 10లో ఉన్నాడు. త్వరలో మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ తో కలిసి ఓ ఆల్బం చేయబోతున్నాడు. జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

English summary
Pop sensation Justin Bieber has reportedly said no to drink and drugs. "There's no one just looks up to more than Carl. He's had a huge influence on him. They spoke at length about how he can get his life and career back on track and both agreed that getting rid of alcohol and drugs was the natural first step. "Justin has made promises like this before but this time we all genuinely believe he is clean. His manager Scooter Braun was very clear that, until Justin sorted himself out, his music comeback was on hold," a source said.
Please Wait while comments are loading...