స్టార్ సింగర్ స్టూడియోలో దొంగతనం,భార్య తరపు బంధువులే?
లాస్‌ఏంజెల్స్: ఓ ప్రక్కన కాపీ వివాదంలో ఇరుక్కుని సమస్యలో ఉన్న ఇంటర్నేషనల్ సింగర్, ర్యాపర్ కాన్యేవెస్ట్‌కి మరో దెబ్బ తగిలింది. ఆయనకు చెందిన కలాబాసాస్ స్టూడియోలో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి కొంతమంది తెలియని వ్యక్తులు స్టూడియోలో చొరబడి 20 వేల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్, కంప్యూటర్లు దొంగిలించినట్లులాస్ ఏంజెల్స్ కు చెందిన పోలీస్ అధికారులు తెలిపారు.

అయితే ఇవి వరస దొంగతనాల్లో ఒకటా అనే అనుమానాలు సైతం ఉన్నాయి. వారం రోజుల క్రితం ప్రముఖ టీవీ సెలబ్రెటీలు స్కాట్ డిసిక్, బ్లాక్ షినాల ఇళ్లల్లోనూ దోపిడీ జరిగింది. మరో విషయమేమిటంటే.. వీరంతా కాన్యే వెస్ట్ భార్య కిమ్ కర్దాషియాన్ తరఫు బంధువులే.

పైగా ఎక్కడా కూడా దోపిడీ కోసం బలప్రయోగంతో లోనికి ప్రవేశించిన ఆనవాళ్లు లేవు. దాంతో ఈ సంఘటనల్లో ఇంటిమనుషులు లేదా తెలిసినవారి ప్రమేయం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


Click it and Unblock the Notifications











