»   » పుట్టబోయే పాపాయి కోసం అంత ఖరీదు భవంతా

పుట్టబోయే పాపాయి కోసం అంత ఖరీదు భవంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేట్ హుడ్సన్ తనకు కాబోయే భర్త మ్యాట్ బెల్లామీ ఇద్దరూ కలసి లాస్ ఏంజిల్స్‌లో $4.95మిలియన్ పెట్టి అందమైన భవంతిని కొనుగోలు చేయడం జరిగింది. ఇంత ఖరీదు పెట్టి కేట్ హుడ్సన్ ఈ భవంతిని కొనుగోలు చేయడానికి కారణం కేట్ త్వరలో తల్లి కాబోతుంది. తనకు పుట్టుబోయే పాపాయి కోసం కేట్ ఫసిఫిక్ మహా సముద్ర తీరం బీచ్ తీరంలో ఐదు పడగగదులు ఉండేటటువంటి లగ్జరియస్ ఇంటిని కోనుగోలు చేయడం జరిగింది. కేట్ ప్రస్తుతం ఉన్నటువంటి మాలిబు మాన్షన్‌తో పోల్చినట్లైతే ఇది చాలా ఖరీదు భవంతి అని సమాచారం.

ఇక ఇంటి నిర్మాణం గనుకు చూసినట్లైతే మొత్తం 650 స్కేర్ మీటర్ల పరిధిలో ఇంగ్లీషు స్టయిల్ మాదిరి దీనిని రూపోందించడం జరిగింది. ఇందులో ఏడు స్నానపు గదులు, ఓ పెద్ద లైబ్రరీ, జిమ్ లాంటి అన్ని అధునాతన సదుపాయాలు అన్నింటిని ఈ ఇంట్లో అమర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇల్లు ఫేమస్ స్టార్ హీరోయిన్ కర్ట్ రస్సెల్ తల్లి దండ్రులు ఇంటికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ ఇంటిని తీసుకోవడం జరిగిందని కేట్ తెలిపారు.

ఇక కేట్ హుడ్సన్ వయసు 32 సంవత్సరాలు కాగా, ఆమెకి కాబోయే భర్త బెల్లామీ వయసు 33. వీరిద్దరూ పోయిన సంవత్సరం ఏప్రిల్ నుండి డేటింగ్‌లో పాల్గోనడం జరుగుతుంది. కేట్ హుడ్సన్‌కి మొదటి భర్త క్రిస్ రాబిన్ సన్ ద్వారా ఓ అబ్బాయి జన్మించాడు. కేట్ కోడుకు పేరు రైడర్. అతనికి ఏడు సంవత్సరాల వయసు. ఐతే కేట్ ప్రస్తుతం బెల్లామీతో కలసి ఉంటుంది. అందుకే బెల్లామీ ద్వారా తను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయాన్ని గతంలో ధృవీకరించిన సంగతి తెలిసిందే.

English summary
Kate Hudson and fiance Matt Bellamy have reportedly bought a $4.95 million Los Angeles mansion. The couple, who are expecting their first child, settled on the luxurious five-bedroom home in the beach side suburb of Pacific Palisades after deciding against a more expensive Malibu mansion they were looking at in March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu