»   » తన నగ్న ఫోటోపై సంతకం చేయనంటోన్న హీరోయిన్

తన నగ్న ఫోటోపై సంతకం చేయనంటోన్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ కాంబినేషన్ లో వచ్చిన 'టైటానిక్‌' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ నగ్న అందాలను హీరో లియోనార్డో డికాప్రియో తన పెయింటింగుతో చిత్రీకరించడం సినిమాకు హైలెట్.

ఈ మధ్య కేట్ విన్స్‌లెట్ ఎక్కడ కనిపించినా....పలువురు అభిమానులు టైటానిక్ చిత్రానికి సంబంధించిన ఆమె నగ్న పోటోను తీసుకొచ్చి ఆమెతో ఆటో గ్రాఫ్ చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే తన నగ్న ఫోటోపై సంతకం చేయడం నాకు అస్సలు నచ్చదు, ఎవరైనా అభిమానులు అలా అడిగితే నేను ఇబ్బందిగా ఫీలవుతాను అని కేట్ విన్స్‌లెట్ చెప్పింది.

Kate Winslet can't autograph her nude Titanic pic

ఈ చిత్రం తెరకెక్కిపుడు హీరో లియోనార్డో వయసు 22, హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ వయసు 21. టైటానిక్ అనే భారీ ఓడ మునిగిపోయిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1912 ఏప్రియల్ లో టైటానిక్ ఓడ మునిగి పోయింది. ఈ ఓడ మునిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో వచ్చిన టైటానిక్ చిత్రాన్ని మళ్లీ 3డి ఫార్మాట్లో ఇటీవల విడుదల చేసారు.

ప్రపంచ సినిమా చరిత్రలో 'టైటానిక్' అనే ప్రేమ కథా చిత్రం మరుపురాని చిత్రంగా నిలిచి పోయింది. సినిమా వచ్చి ఇన్నేల్లయినా.....ఇప్పటికీ ఆ సినిమా అంటే అందరికీ క్రేజే. అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటానిక్ తర్వాత ఎన్ని రకాల ప్రేమకథా చిత్రాలు వచ్చినా...ఆ ఫీల్ మాత్రం తేలేక పోతున్నాయి.

English summary
Kate Winslet has revealed that her nude Titanic portrait where she draped herself naked over a sofa still haunts her and that she always declines to autograph a copy of it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu