»   » ఒక్క రోజులో సెలబ్రిటీ హీరోయిన్ అయిన స్టార్ హీరోయిన్

ఒక్క రోజులో సెలబ్రిటీ హీరోయిన్ అయిన స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kate Winslet
టైటానిక్ సినిమాలో తన అందచందాలను చూపించి యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు కేట్ విన్స్‌లెట్. నిన్న కరేబియన్ దీవుల్లో జరిగిన ఘోర ప్రమాదం నుండి కేట్ విన్స్‌లెట్ బిలియనీర్ బిజినెస్ మొగల్ బ్రాన్‌సన్ తల్లిని కాపడడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే కరేబియన్ దీవుల్లో రిచర్డ్ బ్రాన్ సన్ ప్రయివేట్ ఐలాండ్ లో ఉన్న ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించిగా అదే సమయంలో అక్కడున్న కేట్ విన్స్‌లెట్ సినిమాలలో హీరో మాదిరి వీరోచితంగా 90సంవత్సరాలు వయసు ఉన్న బ్రాన్ సన్ తల్లిని మంటల నుండి కాపాడి సెలబ్రిటీ హీరోగా కీర్తింపబడుతున్నారు.

సిబిఎస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో బిలియనీర్ బిజినెస్ మొగల్ బ్రాన్‌సన్ టైటానిక్ స్టార్ హీరోయిన్ తన తల్లిని ఎలా కాపాడిందో తెలియజేశారు. ఒక్కసారిగా మా ఇంట్లో మంటలు వ్యాపించగా మాకు అందరికి ఏమి చేయాలో అర్దం కాలేదు. మా తల్లికి 90 సంవత్సరాలు వయసు ఉంటుంది. ఆమె నడవగలదు కూడా. కానీ మంటలు ఉదృతం అవుతయనే ఉద్దేశ్యంతో మా తల్లిని ఒక్కసారిగా ఒడిలోకి ఎత్తుకోని కేట్ విన్స్‌లెట్ బయటకు తీసుకొని రావడం జరిగింది తెలియజేశారు.

ఇది ఇలా ఉంటే హాలీవుడ్ మరో హీరోయిన్ జెన్నిత్ పాల్ట్రో గతంలో న్యూయార్క్ డబ్ల్యుటిసి టవర్స్ కూలినప్పుడు పాదచారుల వంతెన వద్ద ఓ మనిషిని కాపాడడం జరిగింది. ఆ సందర్బంలో జెన్నిత్ పాల్ట్రో యావత్ హాలీవుడ్ అభినందనలు తెలియజేయడమే కాకుండా ఆమెని సెలబ్రిటీ హీరోగా అభివర్ణించారు.

English summary
Yesterday, we told you Kate Winslet had escaped unharmed from a fire that destroyed Richard Branson's private island home in the Caribbean. Today, we're happy to report the actress not only survived that incident, but did so in heroic fashion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu