»   » అతనితో నా సంబంధం ఇంకా కొనసాగుతోంది: టైటానిక్ లవ్ స్టోరీ రహస్యం విప్పిన కేట్ విన్స్లేట్

అతనితో నా సంబంధం ఇంకా కొనసాగుతోంది: టైటానిక్ లవ్ స్టోరీ రహస్యం విప్పిన కేట్ విన్స్లేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

1912లో జరిగిన టైటానిక్‌ షిప్‌ ప్రమాదం నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ 1997లో 'టైటానిక్‌'గా తెరకెక్కించారు. విషాదభరిత ప్రేమకథా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. కథ విషయానికొస్తే, ఓ ప్రిన్స్‌తో పెళ్ళి ఫిక్స్‌ అయిన హీరోయిన్‌ను చూసి లక్కీ డ్రా ద్వారా టైటానిక్‌లో ప్రయాణించే ఛాన్స్‌ కొట్టేసిన హీరో ప్రేమలో పడతాడు.

టైటానిక్‌

టైటానిక్‌

ప్రిన్స్‌తో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని హీరోయిన్‌ కూడా హీరో అంటే ఇష్టపడుతుంది. వీరి పరిచయం గాఢమైన ప్రేమగా మారిన క్రమంలో ఒక భారీ ఐస్‌మౌంటెన్‌ని ఢీ కొట్టి టైటానిక్‌ షిప్‌ సముద్రంలో మునిగిపోతుంది. అందులో ప్రయాణి స్తున్న వారంతా ప్రాణాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, హీరోయిన్‌ని కాపాడి హీరో చనిపోతాడు.

లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లేట్‌

లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లేట్‌

యావత్‌ ప్రపంచాన్ని కలచివేసిన ఈ సంఘటన నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యూత్‌ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను, సినీ విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలందుకుంది.ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లేట్‌లు జీవితాంతం టైటానిక్ విజయాన్ని మరిచిపోరు.

టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా

టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా

రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్‌లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా నటుడు డికాప్రియోతో తన రిలేషన్‌ను షేర్‌ చేసుకున్నారు. టైటానిక్ మూవీ తర్వాత మా ఇద్దరికి చాలా గుర్తింపు దక్కింది.

మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది

మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది

ఇప్పటికీ మా ఇద్దరినీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం టైటానిక్. ఆ మూవీ షూటింగ్‌లో ఏర్పడ్డ మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంకా చెప్పాలంటే డికాప్రియో నాకు కుటుంబసభ్యుడు లాంటివారు. అతడితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాస్తవానికి మాపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి టైటానిక్‌ క్లైమాక్స్‌లో జరిగినదే నిజ జీవితంలోనూ జరిగిందంటూ' కేట్ చమత్కరించారు.

English summary
In a new interview with Glamour magazine, Katie Winslet has revealed that she has a 'very, very close' relationship with her Titanic co-star Leonardo DiCaprio
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu