»   » ప్రీగా పనిచేస్తున్న ఆస్కార్ అవార్డ్ నటి..!!

ప్రీగా పనిచేస్తున్న ఆస్కార్ అవార్డ్ నటి..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

1997వ సంవత్సరంలో వచ్చిన టైటానిక్ సినిమా ద్వారా పరిచయమై అందరి హృదయాలనూ దోచుకున్న నటి కేట్ విన్స్లెట్. తన తొలి చిత్రంతోనే ఆస్కార్ అవార్డు నామినేషన్ సొంతం చేసుకున్న కేట్ అప్పుడ తృటిలో అవార్డును మిస్ అయినా గత ఏడాది 'ది రీడర్' చిత్రంతో ఆస్కార్ దాహాన్ని తీర్చుకుంది. కాగా ఇప్పుడీమె ఓ సినిమా కథను నెరేట్ చెయ్యడానికి పెద్ద మొత్తంలో డబ్బు అందే అవకాశం వున్నా తాను ఉచితంగానే చేస్తానని చెప్పిందట.

అసలు విషయానికి వస్తే ఫెడ్రిక్ థార్ ఫెడ్రిక్ సన్ అనే దర్శకుడు ఓ సినిమాను తీసి అందుతో కథను నెరేట్ చెయ్యాల్సిందిగా కేట్ ను అభ్యర్థించాడు. సరే కానీ ముందు సినిమా చూసాకే అని కేట్ నిబంధన పెట్టిందట. దీంతో ఈ సినిమా ఓ కాపీని ఆమెకు పంపాడట ఫెడ్రిక్. ఈ సినిమాను తన కూతురితో కలసి చూసిన కేట్ సినిమాను చూసి ఉద్వేగానికి లోనయి కన్నీటిపర్యంతం అయిందట. ఇందులో మాట్లాడలేని స్థితిలో వున్న తన కొడుకు కోసం ఓ తల్లి పడే ఆరాటం ఆమెను కదిలించిందట. సినిమాను చూసిన కేట్ కుమార్తె కూడా నువ్వీ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నీ అదృష్టం అని వ్యాఖ్యానించిందట. దీంతో వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి తానీ సినిమాకు ఉచితంగా పనిచెయ్యాలనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో ఫెడ్రిక్ ఎంతో సంతోషించాడట. కేట్ ఉదారస్వభావం గురించి పొగడ్తలతో ముంచేస్తున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu