»   » 'అవతార్' ప్రభంజనానికి చెక్ పెట్టిన ఓ 'మహిళ'..!!

'అవతార్' ప్రభంజనానికి చెక్ పెట్టిన ఓ 'మహిళ'..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచం యావత్తూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల్లో అందరూ ఊహించినట్టుగానే డైరెక్టర్ గిల్డ్ అవార్డును గెలుచుకున్న 'ది హర్ట్ లాకర్' దర్శకురాలు క్యాథరీన్ బిగిలోవ్ ఉత్తమ దర్శకురాలి అవార్డును గెలుచుకొని తన మాజీ భర్త అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ కు చిత్తుచేసింది. అంతే కాదు మహిళ దినోత్సవం నాడు తొలిసారి ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మహిళగా రికార్డు సృష్టించింది.

ఇక హర్ట్ లాకర్ సినిమా అన్ని ప్రధాన విభాగాల్లోనూ అవార్డుల పంట పండించుకుంది. అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన అవతార్ సినిమాకు ధీటుగా తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు పొందిన ఈ సినిమా మొత్తంగా ఆరు విభాగాల్లో అవార్డును గెలుచుకుంది. ఇక అవతార్ సినిమా కేవలం మూడు అవార్డులతో తృప్తిపడాల్సి వచ్చింది. ఈ మూడు అవార్డులు కూడా ఉత్తమ సెట్ డిజానర్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి అంతగా ప్రాధాన్యం లేని విభాగాల్లో అవార్డును సొంతం చేసుకోవడం మరింతగా నిరాసరిచే విషయం. ఏదైతేనేమి అబల కాదు సబల అని నిరూపించుకొన్న క్యాథరీన్ కు శుభాకాంక్షలు....!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X