»   » 'అవతార్' సినిమాకు ఇక ఆస్కార్ అవార్డు కలలో మాటే..!!

'అవతార్' సినిమాకు ఇక ఆస్కార్ అవార్డు కలలో మాటే..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు ఎవరికి వస్తుందో తెలిపే డైరెక్టర్స్ గిల్డ్ అవార్డు ఈ ఏడాది 'ది హర్ట్ లాకర్స్' సినిమాకు దర్శకత్వం వహించిన క్యాథరిన్ బిగిలోను వరించింది. తన మాజీ భర్త, అవతార్ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్ నుండీ ఈమెకు గట్టిపోటీ ఎదురైనా ఆమె విజేతగా నిలిచింది. దీంతో ఆస్కార్ అవార్డును కూడా ఈమె సొంతం చేసుకోనుంది. అదెలాగంటే 1948వ సంవత్సరం నుండీ నిర్వహిస్తున్న ఈ అవార్డుల్లో విజేతగా నిలిచిన దర్శకున్నే ఆస్కార్ వరిస్తుండటం జరుగుతోంది. 50 ఏళ్లకు పైగా చరిత్ర వున్న ఈ అవార్డుల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే ఈ అంచనా తప్పింది. దీనికి తోడు క్యాథరిన్ రూపొందించిన ఈ సినిమా ఇరాక్ యుద్ధనేపథ్యంలో జరుగుతుంది. అవతార్ సినిమా ఓ ఊహాజనిత కథ కాగా ఇది ఆలోచింపజేసే రియల్ స్టోరీ కావడం మరో ప్లస్ పాయింట్. దీంతో ఈ ఏడాది ఆస్కార ఖచ్చితంగా క్యాథరిన్ నే వరిస్తుందనే అందరూ భావిస్తున్నారు.

ఈ వార్తతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొంది, ఆస్కార్ తనకే వస్తుందనే ధీమాతో వున్న కామెరూన్ ఢీలా పడ్డారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్షన్లలో టైటానిక్ అధిగమించిన అవతార్ అవార్డుల్లో అధిగమించలేదనే విమర్శలు ఎదురవుతున్న ఈ సమయంలో ఉత్తమ దర్శకుడిగా కూడా ఆస్కార్ మిస్ అయితే ఎలాగా అని కామెరూన్ ఆలోచనలో పడ్డారంట. ఆయన శ్రేయోభిలాషులు మాత్రం ఇప్పటి వరకూ ఆరు సార్లు అంచనా తప్పింది, ఈ సారి కూడా ఆ అంచనా తలక్రిందులయి ఖచ్చితంగా ఆస్కార్ నీకే వస్తుంది అని దైర్ఘ్యం చెబుతున్నారంట. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మార్చి 7వ తారీఖు వరకూ ఆగాల్సిందే...!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu