»   » ఫొటోల్లో బాగా రావాలని అది కోయించుకోమంటోంది..!!

ఫొటోల్లో బాగా రావాలని అది కోయించుకోమంటోంది..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ను వివాహం చేసుకోవడానికి ఎన్నో తిప్పలుపడిన అలెక్స్ రెయిడ్ పెళ్లి తర్వాత హమ్మయ్యా సాధించానని సంబరంపడుతున్నాడు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి పెనం నుండీ పొయ్యిలో పడ్డట్టు అయింది. దీనికి కారణం క్యాటీ విపరీత కోర్కెలే. ఇటీవల ఆమె అతన్ని అడిగిన కోరికను విని అతను నిర్ధాంతపోయినప్పటికీ, కాదంటే ఎక్కడ ఆమె అలుగుతుందోనని సరేనని అన్నాడట. ఇంతకీ అతన్ని అంతగా నిర్ధాంతపోయేలా చేసిన కోరిక ఏదని అనుకుంటున్నారా..!? అయితే ఇది చదవండి...

ఇటీవలే వెనీస్ లో ఏ ఆడంబరం లేకుండా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాగా మీడియా ముందు వీరిద్దరూ మరోసారి వివాహం చేసుకోనున్నారు. అందులో తీసే ఫొటోల్లో బాగా రావాలని ఆమె రెయిడ్ ను ముక్కును, చెవిని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొమ్మని చెప్పిందట. తొలుత అతను ఆమె కోరికను ఖచ్చితంగా కాదని అనకున్నా వద్దని చెప్పడానికి ప్రయత్నించినా ఆమె ససేమీరా అనడంతో అతను ప్లాస్టికి సర్జరీకి సిద్ధపడుతున్నాడట. పొటోల కోసం ముక్కును కోయించుకోవటం ఏంటని, పాపం రెయిడ్ అని అతని సన్నిహితులు వాపోతున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu