»   » ఏ రోజు మగాడితో తిరుగుతానో నాకే తెలియదు

ఏ రోజు మగాడితో తిరుగుతానో నాకే తెలియదు

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ తన భర్తల విషయంలో ఎప్పుడూ గందరగోళానికి లోనవుతూ వుంటుంది. తొలుత పీటర ఆండ్రీని వివాహం చేసుకుని ఎన్నో వివాదాల మధ్య అతని నుండీ విడిపోయి అలెక్స్ రెయిడ్ తో తిరిగి, హఠాత్తుగా అతన్ని వివాహం చేసుకుని ఆశ్చర్యపరచిన క్యాటీ మరో సారి తన భర్తల విషయంలో గందరగోళానికి తావిచ్చింది.

ఇటీవలో ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ తన భర్త పేరును అలెక్స్ రెయిడ్ కు బదులుగా పీటర్ ఆండ్రీ అని పలికి నాలుక్కరుచుకుంది. వెంటనే తేరుకుని రెయిడ్ అని చెప్పి తన తప్పును సరిచేసుకుంది. ఇహ అలెక్స్ తో ఈమెగారి వివాహాన్ని ప్రభుత్వం రద్దుచేయడంతో వీరిద్దరూ మరోసారి వివాహం చేసుకోనున్నారు. వచ్చే వేసవిలో ఈ వివాహం జరుగుతుందని ఆమె స్పష్టం చేసింది. మరి అప్పటివరకయినా తన భర్తగా అలెక్స్ వుంటాడో లేక మరెవరినైనా వివాహం చేసుకుంటుందో ఆమెకే తెలియాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu