»   » భర్తే దెయ్యంలా వెంబడిస్తున్నాడా..? లేక మరేదైనా..

భర్తే దెయ్యంలా వెంబడిస్తున్నాడా..? లేక మరేదైనా..

Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ తన ఇంటిని అమ్మకానికి పెట్టిందట. ఆ ఇందులో ఏముందిలే మరో ఇంట్లోకి మారడానికి ఈ ఇళ్లు అమ్మేస్తోంది అనుకుంటున్నారా..!? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మరి ఆమె ఏ కారణం చెప్పిందీ వింటే మీరు మరింతగా ఆశ్చర్యపోతారు. ఆవిడ గారు తన రెండవ భర్త, బాక్సర్ అలెక్స్ రెయిడ్ తో కలసి వుంటున్న ఈ ఇంట్లో రెండు దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పిందట. అంతే కాదు ఆ రెండు దెయ్యాలూ తనని వెంటాడుతున్నాయని తన సన్నిహితుల వద్ద వాపోయిందట.

ఈ పెద్ద బంగళాలో క్యాటీ ప్రైజ్ ప్రస్తుతం వుంటున్న గ్రౌండ్ బేస్ లో వున్న గదిలో రోజూ ఓ నీడ కనపిస్తూ భయపెడుతోందట. ఆ అదంతా అపోహ అని కొట్టిపారేసిన ఆమెకు తన భర్త అలెక్స్ రెయిడ్ కూడా తనుంటున్న గదిలో ఓ ముసలావిడ తిరుగుతూ కనిపించిందని చెప్పాడట. దీంతో ఆమె భయంభయంగా కాలం వెల్లదీస్తుంటే ఓ రోజు హఠాత్తుగా ఓ మగ దెయ్యం తనని వెంటాడుతూ రావడం గమనించిందట. దీంతో హడలిచచ్చిన ఆమె వెంటనే తన ఎస్టేట్ మేనేజర్ కు తన బంగళాను అమ్మకానికి వుంచనున్నట్టు ప్రకటించమని కోరిందట.

మరికొందరయితే ఆమెను దెయ్యాలు కాదు తన మాజీ భర్త పీటర్ ఆండ్రీ జ్ఞాపకాలు వెంబడిస్తున్నాయని అందుకే ఇళ్లు ఖాళీ చెయ్యాలనుకుంటోదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఆమెకే తెలియాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu