»   » ఆ స్టార్ మోడల్ రెండో పెళ్లయినా నిలబడేనా..!?

ఆ స్టార్ మోడల్ రెండో పెళ్లయినా నిలబడేనా..!?

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ తన ప్రియుడు అలెక్స్ రెయిడ్ ను ఎట్టకేలకు వివాహం చేసుకుంది. ఇన్నాళ్లు ఓ సారి కలసివుంటూ, ఓ సారి విడిపోతూ దాగుడుమూతలు ఆడిన వీరిద్దరూ నిన్న లాస్ వెగాస్ లో ఒకటయ్యారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు. రెయిడ్ లండన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో విజేతగా తిరిగి రావడంతో తామిద్దరం వెంటనే వివాహం చేసుకోవాలని క్యాటీ నిర్ణయించుకోవడంతో వీరిద్దరూ హడావిడిగా పెళ్లిచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

గత ఏడాది తన భర్త పీటర్ ఆండ్రీ నుండీ విడిపోయాకా క్యాటీ రెయిడ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. మధ్యలో ఓ సారి అభిప్రాయబేధాలతో విడిపోయినా రెయిడ్ ఆమెను బుజ్జగించి తిరిగి తన దారికి తెచ్చుకున్నాడు. ఆమె కోసమే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా తిరిగి వచ్చాడు, ఆమె మనసును గెలుచుకున్నాడు. దీంతో ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరి వైవాహిక బంధం అయినా కలకాలం కొనసాగాలని ఆశిద్దాం..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu