»   » ఈ ఏడాది హాట్ బ్యూటీ సంపాదన రూ. 890 కోట్లు!

ఈ ఏడాది హాట్ బ్యూటీ సంపాదన రూ. 890 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ 2015లో అత్యధికంగా సంపాదించిన నటిగా నిలిచింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన వివరాల ప్రకారం 31 ఏళ్ల ఈ సుందరి ఈ ఏడాది 135 మిలియన్ డాలర్లు సంపాదించింది. మన కరెన్సీలో ఈ లెక్క రూ. 890 కోట్లు.

ఇటీవల ఆమె పారిస్మాటిక్ వరల్డ్ టూర్ పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపు 126 షోలు ఇచ్చింది. ఈ టూర్లో ఆమె ఒక్కో షోకు 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఆర్జించిందట. దీన్ని బట్టి కేటీ పెర్రీ మ్యూజిక్ షోలకు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

2014లో మరో సింగర్ టైలర్ స్విప్ట్ సంపాదనలో టాపులో నిలిచింది. 25 ఏళ్ల వయసున్న ఆమె గతేడాది ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన జాబితాలో మోస్ట్ పేయిడ్ ఫిమేల్ మ్యూజిషియన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ ఏడాది టైలర్ స్విప్ట్ 80 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇంత భారీ మొత్తంలో డబ్బు ఆర్జించడం, ఫోర్బ్స్ జాబితలో టాప్ పొజిషన్లో నిలవడంపై కేటీ పెర్రీ ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ...‘ఒక బాస్‌గా ఈ పొజిషన్ దక్కడంపై గర్వ పడుతున్నాను. వ్యక్తిగా నేను సొంత కంపెనీ రన్ చేస్తున్నాను' అని కేటీ పెర్రీ వెల్లడించింది.

స్లైడ్ షోలో ఫోటోస్...

నెం.1 కేటీ పెర్రీ

నెం.1 కేటీ పెర్రీ

31 ఏళ్ల ఈ సుందరి ఈ ఏడాది 135 మిలియన్ డాలర్లు సంపాదించింది. మన కరెన్సీలో ఈ లెక్క రూ. 890 కోట్లు.

నెం.2 టైలర్ స్విప్ట్

నెం.2 టైలర్ స్విప్ట్

కేటీ పెర్రీ తర్వాతి స్థానంలో 80 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపాదనతో టైలర్ స్విప్ట్ రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానం

మూడో స్థానం

ఫ్లీట్ వుడ్ మాక్ బ్యాండ్ రన్ చేస్తున్న స్టేవీ నిక్స్, క్రిస్టినె మెక్వి 38.6 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడో స్థానంలో ఉన్నారు.

4వ స్థానంలో....

4వ స్థానంలో....

38.3 మిలియన్ డాలర్ల సంపాదనతో లేడీ గాగా నాల్గవ స్థానంలో ఉంది.

ఐదవ స్థానంలో....

ఐదవ స్థానంలో....

35.4 మిలియన్ డాలర్ల సంపాదనతో బియాన్స్ ఐదో స్థానంలో నిలిచారు.

English summary
Katy Perry, the 31 years old musician has definitely roared by beating Taylor Swift in the Dollars department! The singer has been ranked the most earning actress of 2015, for earning a whooping amount of $135 million.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu