»   » కాళి మాత ఫోటో.... వివాదంలో హాలీవుడ్ పాప్ స్టార్!

కాళి మాత ఫోటో.... వివాదంలో హాలీవుడ్ పాప్ స్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ పాప్ సింగర్, హాలీవుడ్ స్టార్ కేటీ పెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కాళి మాత ఫోటో వివాదానికి దారి తీసింది. కాళి మాత ఉగ్రరూపానికి సంబంధించిన ఫోటో పోస్టు చేసిన కేటీ పెర్రీ..... ప్రస్తుతం నా మూడ్ ఇలా ఉందంటూ పేర్కొంది.

అయితే కేటీ పెర్రీ ఈ ఫోటో పోస్టు చేయడంపై కొందరు ఇండియన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలైనప్పటికీ... మరికొందరు విమర్శలకు దిగారు. మేము పూజించే దేవత ఫోటోను నీ మూడ్ తో కంపేర్ చేయడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

current mood

A post shared by KATY PERRY (@katyperry) on Apr 18, 2017 at 6:57pm PDT

ఈ ఫోటో వెనక ఉన్న స్టోరీ ఏమిటో ఆమెకు తెలియదు.... ఇలాంటి పోస్టును ఎవరైతే ఇండియన్స్ సపోర్ట్ చేసారో అలాంటి వారు సిగ్గు పడాలి. ఇలాంటి వాటిని అడ్డుకోకుండా మద్దుతు ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీ పెర్రీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే 2010లో ప్రియుడు రస్సెల్ బ్రాండ్ తో జరిగిన వివాహాన్ని రాజస్థాన్ లో జరుపుకున్నారు. తర్వాత వారు 2012లో విడిపోయిన సంగతి తెలిసిందే.

English summary
American singer Katy Perry became a victim of online trolls when she posted an image of Indian Goddess Kali on social media to depict her "current mood". Perry shared the image on Instagram on Tuesday night and captioned it: "Current mood."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu